Thursday, December 31, 2009

Happy new year!!

ఒక సరదా సంభాషణ :
నేను: Happy new year!!
నువ్వు : Thank you. same to you.
నువ్వు : నూతన సంవత్సరం నిజంగా నూతనం గా వుంటుందనే ?
నేను: కొత్త సంవత్సరం కదా.. కొత్త గానే వుంటుంది..
నువ్వు : తేదీలు మారిపోతే, జీవితాలు మారిపోతాయా ?
నేను: నువ్వన్నదీ నిజమే కానీ, మార్పు కోరుకోవడంలో తప్పు లేదు కదా.. ఎందుకంటే మనిషి ఆశా జీవి.
నువ్వు: నిజం గా మార్పు కావాలి అనుకుంటే, నూతన సంవత్సరం కోసం ఎదురు చూడడం ఎందుకు.. ఈ రోజే మారొచ్చుకదా..
నేను: అవుననుకో..
మళ్ళీ నేనే : ఎవరెవరి జీవితాలనో ఉద్ధరించకపోయినా, నేను నా పుట్టిన రోజు ని ప్రతీ ఏడూ తప్పక జరుపుకున్నప్పుడు, కాలానికీ కూడా ఆ హక్కు వుంది కదా మరి.
నువ్వు : తప్పు లేదు లే.. ఖచ్చితంగా. . గమ్యమెక్కడో తెలియని ప్రయాణంలో, మైలు రాళ్ళూ ఓదార్పునిస్తాయి, కాసేపు సేద తీరుస్తాయి. . any new resolutions ?
నేను : గత సంవత్సరం అనుకున్న resolutions అలానే వున్నాయి.. పాటించగలిగితే.. నీ సంగతి ?
నువ్వు : నా పరిస్థితీ దాదాపుగా అలానే వుంది. ఏముంది.. ఓ నాలుగు కన్నీళ్ళు, మూడు చిరునవ్వులు.. రెండు ఓటములు.. మధ్యలో ఒక గెలుపు. ఈలోగా మళ్ళీ కొత్త సంవత్సరం.

ఏది ఏమైనా 2009 వెళ్ళిపోతోంది, అందరి జీవితాలని ఇంకో కొత్త మెట్టు మీదకి నెట్టి తను మాత్రం మెల్లగా జారుకుంటోంది. ఎప్పుడో పదేళ్ళకి 2009 ని తలుచు కుంటే, మనకి గుర్తొచ్చేది పంచుకున్న ఆనందాలే కానీ, కన్నీళ్ళు కాదు, కారాదు. అందుకే నాకు గతం అంటే ఇస్టం, గౌరవం. ఏందుకంటే వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, పంచిన చిరునవ్వులు ఆనందాన్ని ఇస్తే, దాటి వచ్చిన కన్నీటి మలుపులు, కాలంపై నా విజయాలను గుర్తు చేస్తాయి. కొత్త సంవత్సరం, అందరి జీవితాల్లోనూ మరిన్ని ఆనందాల్ని నింపాలని మనసారా కోరుకుంటూ.. "Wish You A Very Happy New Year".. అందరికీ...

(ఇంకొక ఆనందించదగ్గ విషయం ఏంటంటే, ఎవో నాల్గు పోస్టులు రాసి, ఆపేస్తానేమో అని అనుకున్న నేను, నేటికి, అర్థ శతకం పూర్తి చేసాను.. :-) కొత్త సంవత్సరంలో మరొక కొత్త పోస్ట్ తో మళ్ళీ కలుద్దాం.. )

Tuesday, December 29, 2009

మౌనం

ఎప్పుడో రాసుకున్నాను, "మౌనంతో మాటలాడితే నిశ్శబ్ధమే నేస్తమవ్వదా" అని..
నిజంగానే మౌనం మాటలాడుతుందా ? అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, మౌనం మాటల కంటే ఎక్కువే మాటలాడుతుందని, అర్థం లేని మామూలు మాటలకంటే చాలా బాగా కూడా మాటలాడుతుందని. ఏ భాషా చెప్పలేని ఎన్నో భావాలను మౌనం భలే తేలిగ్గా చెప్పేస్తుంది. మాటలకి అర్థం దాదాపుగా ఒకేలా ఉంటుందేమో.. ఎవరు అన్నా.. ఎవరు విన్నా.. , కానీ మౌనానికి అర్థం వినే హృదయానికే తెలుసు. సరిగ్గా మంచి కవిత్వం లా. అమ్మతో సాగర తీరంలో నడుస్తుంటే, ఏ మాటా లేకుండా.. ఎన్నో చెప్పినట్టు,.. ఎన్నో విన్నట్టు అనిపిస్తుంది. అందులో ఆశ్చర్యం ఏముంది ? అయినా అర్థం చేసుకునే హృదయం తోడుగా వుండాలే కాని, మాటలెందుకు. దండగ కదా. మౌనం నన్ను నాకు పరిచయం చేస్తుంది.. నన్ను నాకు దగ్గర చేస్తుంది. అది నా సమస్యల్ని తీర్చదు, కానీ నా "అసలు సమస్య" ఏంటో నిజాయితీగా చెప్తుంది.
నీకు అర్థమవ్వాలని నేను ఎప్పుడూ నీతో మాటలాడుతూనే ఉంటే నాకు నేను ఎప్పుడు అర్థమౌతాను ?
నిన్ను గెలవాలని నేను ఎప్పుడూ నీతో వాదిస్తూనే ఉంటే నన్ను నేను ఎలా గెలుస్తాను ?

Sunday, December 27, 2009

రొటీన్ గా ఇంకో రోజు..

రాత్రంతా ఆశల్ని కని అలసిన నా కళ్ళు..
గది గోడల మీద చతికిలబడిన ఉషా కిరణాలు..
సూర్యోదయం తలుపులు తడుతుంటే..
కలలన్నీ కార్టూన్లై మాయమైపోతుంటాయి..
రోజు మొదలు.. హడావిడీ మొదలు..
నిన్న సగంలో ఒదిలేసిన క్వెరీ..
మొన్నప్పెడో క్రాష్ అయిన బైనరీ..
మద్యాహ్నం కల్లా చెయ్యాల్సిన డెలివిరీ..
అమ్మో,.,. మొత్తం మత్తు ఒదిలి.. బండి పట్టాల మీదకొస్తుంది..

ఓ నాలుగు సరదా ముచ్చట్లు.. ఓ మూడు అగచాట్లు..
కనీసం రెండు ప్రపంచ యుద్ధాలు.. అన్నీ శ్రీమతితోనే..
వెరసి మనదైన శుభోదయం..
ఇంతలో పొంచివున్న అతి పెద్ద ప్రమాదం...
పనిమనిషి రాకపోవడం. :-).

కట్ చేస్తే.. నింపాల్సిన టైమ్షీట్లు.. భయపెట్టే రివ్యూలు..
మీటింగ్లూ.. ప్లానింగులు...
ఎప్పుడో మధ్యలో సమయం చిక్కినప్పుడు రాసే కోడు.. నాలుగు లైన్లు..
ఎంత చేసినా మెచ్చని బాసు.. ఏంచేసిన తప్పని క్లాసు...
సాయంత్రానికి అద్దంలో వెక్కిరించే సొంత ఫేసు.. కలిపితే ఆఫీసు..
ఏది ఏమైనా.. ఐదు కొట్టెటప్పటికి రోజులో అసలు పని మొదలౌతుంది..
సంధ్య చీకటవ్వకుండా బయలుదేరడం కలగానే మిగిలిపోతుంది..
ఇలా తేది ఎప్పుడో నాకే తెలీకుండా తిరిగి పోతుంది..

నా రాతల్నీ..,, ఊహల్నీ... కలిపేసుకున్న సాగర తీరం..
అంతా ఆగిపోయిందనుకున్న క్షణాన అన్నీ తానే అయిన నేస్తం..
అన్నీ.. ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకం.. అదీ ఎప్పుడో వీకెండ్లో..
ఏమిటీ యాంత్రిక జీవితం.. అని సడన్ గా వస్తుంది.. ఆవేశం..
అన్నీ మార్చేయ్యలని అనిపిస్తుంది.
అప్రైసల్ ఎలా పోయినా పర్లేదు.. ఆరింటికల్లా ఇంటికొచ్చేయాలి..
ఠాగూర్ గీతాంజలి మళ్ళీ రాసేయాలి..
ఏవేవో కొత్త రిసొల్యూషన్లు..

ఈ క్రొత్త అధ్యాయం.. అలా ఒక రెండు పేజీ లు కదిలిందో లేదో..
ఓ తుఫాను.. టీ కప్పులో..
ఆఫీసో, ఇల్లో చెప్పలేను కానీ.
నా చిన్న బ్రతుక్కి .. ఓ చిన్న సైజు ఆపద..
ఓ నాలుగు రోజుల అన్ ప్లాన్డ్ లీవు..
అంతే.. అన్నింటా ప్రతిష్టంభన..

వారం రోజుల అతలాకుతలం..
అనంతరం.. తిరిగి మొదులౌతుంది జీవితం.. మొదటి గడిలోనే..
తీరం దాటిన ఆపద ఇంకాస్త సహనం పెంచితే..
బ్రతుకు.. వేగం మరికాస్త తగ్గించి..
పడకుండా కదిలితే చాలు అని తృప్తి పడుతుంది.
(మరి రిసొల్యూషన్లో... ? ఆ ఒక్కటీ అడక్కండి)

ఎంత వింతైనది ఈ జీవితం..
పరీక్షించాకే పాఠం నేర్పుతుంది..
నేర్చుకున్నది పాటించే వరకూ.. నేర్పుతూనే వుంటుంది..
వెలుగో చీకటో . . రోజు కదులుతూనే వుంటుంది.
తెలియని మలుపులుని పడేసి మరీ పరిచయం చేస్తుంది..
గెలుపో ఓటమో.. పరుగు ఆగనీయదు..
ఎంత వేగం గా పరిగెట్టిస్తుందంటే ..
ఎటు వైపు పరిగెడుతున్నామో.. ఎందుకు పరిగెడుతున్నామో..
మనమే మరచిపోతాం...

Thursday, December 24, 2009

మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..

అయ్యా మీకో దండం...
మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..
మా బతుకులు మాకు ఈయండి..
మీ రాజకీయాలకో దండం.. మీ ఉద్యమాలకో దండం..
ఇక మా కడుపు కాస్త నిండనివ్వండి..
మూటలెత్తే మల్లేశన్న ముద్దదిని పక్షం అయ్యింది..
బందంటారు.. సమ్మె అంటార్..
ఆకలికి ఆంధ్ర .. తెలంగాన తేడా తెలీదయ్య..
టీకొట్టు సింహాచలం.. కొడుకు సచ్చి బండయ్యాడు..
ఎవని కడుపు మంట ఆపుతారయ్య.. ఊళ్ళు కాల్చి..
అమాయకుడి రక్తం ఏరులయ్యింది..
అమ్మ కడుపుకోత కన్నీటి వరదలైంది..
ఆ నెత్తుటిదీ.. ఈ ఏడుపుదీ ఏ రాష్ట్రమయ్యా ?
మేధావులూ. విధ్యార్ధులూ.. మీకూ ఓ పెద్ద దండం..
కలిసి వున్నా.. ముక్కలై మురిసిన..
మాకు రెక్కాడితే గానీ దినం గడవదు..
మీ కొలువు మీకుంటది.. మీ ఇలువ మీకుంటది.
మా పొట్టకొట్టకండి సారూ.
కలిసి వుండిపోతే కరువు ఆగుద్దా ?
ముక్కలైపోతే బీడు పండుద్దా ?
అయ్యా.. ఎంపీలూ ఎమ్మెల్యేలూ.. దండం...
మంత్రులకు ఇంకా పెద్ద దండం..
మీ రాజీనామాలు విదిల్చకండయ్యా.. ఎంగిలాకుల్లాగ..
వొందకో ఓటు అమ్ముకోడానికి సిగ్గెస్తాది మళ్ళీ..
మీకే సత్తువుంటె.. మీ బిజినెస్సులకి చెయ్యండి రాజీనామా..
బామ్మర్ది పేరిన వేసిన టెండర్లు చించండి..
కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. మీరు బాగుంటరు..
మీ పెళ్ళికాళ్ళొస్తరు.. ఆళ్ళింట సావుకు మీరు తోడెల్తరు..
కానీ మాకు చావే పెళ్ళాయె సారు..
ఓ నాలుగు దినాలు మమ్మల్నీ బతికి చావనివ్వండి..
సార్లూ.. కొట్టుకోడంలో బాగా కలిసిపోయారు..
సానా సంతోషం... థాంక్సూ..
మీ జెండా కర్రలెత్తుకుని కలిసి వూర్లో వూరేగండి..
చూడ ముచ్చటగా వుంటది..
కానీ మా కడుపుల్లోకి దించకండి సార్లూ..

( ఎవరు రైటో.. ఎవరు రాంగో కానీ.. మధ్యలో నలిగిపోతున్నది సామాన్యుడే. తొందర్లోనే ఈ రావణ కాష్టానికి ముగింపు పడుతుందని ఆశిస్తూ... )

Sunday, December 20, 2009

చెన్నై లో సంగీత నాట్యోత్సవాలు

ప్రతీ ఏడాదిలానే ఈ ఏడు కూడా సంగీత నాట్య ఉత్సవాలు చెన్నై లో వైభవంగా జరుగుతున్నాయి. నిన్ననే నారదగాన సభ లో జరిగిన ఏసుదాసు కచేరికి వెళ్ళాం. అద్భుతమైన ప్రదర్శన. సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర వరకూ మూడు గంటల పాటు కచేరి అనర్గళం గా సాగింది. ఎక్కువగా త్యాగరాయ కృతులనే ఆలపించిన ఏసుదాసు, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసారనడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చివర్లో పాడిన అయ్యప్ప గీతాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఆయన గొంతులోని గాంభీర్యం, స్వఛ్ఛత ఎప్పుడో విన్న మేఘసందేశం పాటల్లో ఎలా ఉన్నాయో, ఇప్పటికీ అలానే వున్నాయి. నాకు కాస్త దూరంలో కూర్చున్న వ్యక్తి ముస్లిం; వేషధారణ బట్టీ తెలుస్తూనే వుంది, నా కంటే ఎక్కువ ఎంజాయ్ చేసాడనే చెప్పాలి. పాడే వ్యక్తి క్రైస్తవుడు, పాటేమో త్యాగరాయ కృతి, తాళం వేస్తూ పరవిశించిపోతున్న ప్రేక్షకుడు ముస్లిం. మహదానందం గా అనిపించింది. ఇంతకంటే మన సంస్కృతికి నిదర్శనం ఏముంది. నిజం గానే మన సమాజానికి ఆధారమైన కళలు ఎలాంటి వ్యత్యాసాలనైనా కలిపేస్తాయి. మనుగడకు ఒక పరమార్ధాన్ని ఇస్తాయి. అదీ నిజమైన నాగరికత. అదీ మన నాగరికత. నాకు అనిపిస్తుంది, ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మనం, గత వందేళ్ళగా మరుగుజ్జు సంస్కృతుల వెనుక అనవసరం గా పరిగెడుతున్నామేమో అని.. మనం నేర్చుకోవాలి అనుకుంటే, మన గతానికి మించిన పాఠం లేనే లేదు కదా!! ప్రగతి అంటే కాంక్రీటు కట్టడాలూ, కరన్సీ నోట్లేనా ? సమాజపు నిజమైన ప్రగతినీ, పురోగతినీ కొలవాల్సింది.. కల్మషంలేని చిరునవ్వుల్లోనూ, సమిష్టి ఆనందాల్లోనూ, ప్రామాణికమైన నైతిక విలువల్లోనూ కదా ?

(For more details about the schedule of the music and dance festival, you can refer to - http://www.artindia.net/madras09/index.html )

Tuesday, December 15, 2009

జ్ఞాపకాల హరివిల్లు

దాదాపుగా, ఓ పదేళ్ళ క్రితం, నేను కొన్నాళ్ళు "harivillu.com" అని ఒక వెబ్ సైట్ మైంటైన్ చేసాను. ఏవో పాత డైరీలు తిరగేస్తుంటే, అప్పట్లో రాసుకున్న ఈ లైన్లు కనిపించాయి. ఆనందపడ్డాను. నిట్టూర్చాను. జీవితం ఎంత మారినా, కొన్ని భావాలు ఎప్పటికీ సజీవంగానే వుంటాయి కదా!!

హరివిల్లు, అనుభూతుల వినీలంలో మధుర స్మృతుల మంచు తుంపరలు..
స్వగతాల సమీరంలో చిగురిస్తున్న ఆశయాల సువాసనలు.
హరివిల్లు.. సాధించలేనిదే అనుభవించలేవు.. కానీ..

అనుభవించలేనిది సాధించడం ఎందుకు ? అని అమాయకంగా ప్రశ్నిస్తుంది..
నా భావాల రసరమ్య రాగంలో వినిపించని మౌనగీతిక నా హరివిల్లు..
క్షణాలు కెరటాల్లా వచ్చిపోతుంటే, కాళ్ళ క్రింద నేలనీ,

ఆశయాల ఆనవాలుని నాకోసం ఆపిపట్టుకునేది. నా హరివిల్లు.
ఆనందాల్ని నిర్వచిస్తుంది.. ప్రేమను విశ్లేషిస్తానంటుంది..
ఒంటరితనపు చీకట్లలో ఆరని క్రొవ్వొత్తు నా హరివిల్లు...

స్నేహపు వెలుగుల విరిజల్లు నా హరివిల్లు.
------------
వెలుగునంతా నాలోనే వుంచుకుని వీధిదీపాల వెనుక పరిగెడుతున్నానా ?
------------
నాలోంచి రావాల్సిన ఆనందాన్ని ఎప్పుడైతే బయట వెతకడం మొదలు పెట్టానో, ఆ క్షణం నుంచీ నేను నా ఆధీనం నుంచి పరిస్థితుల ఆధీనంలోకి వెళ్ళిపోయాను.
------------
కాస్త కన్నీరూ నీ ఆధిపత్యాన్ని గుర్తు చేస్తుంది. మంచిదే అనుకున్నాను.
------------
ఆనందం ప్రయత్నంలో వుంది, ఫలితంలో కాదు అని తెలుసుకున్నాక, నిజంగానే గెలుపు, ఓటముల మధ్య పెద్దగా తేడా తెలీలేదు.
------------
ఎవరెవర్నో నేనెందుకు మార్చాలి. నన్ను నేను సంస్కరించుకోవడం వద్ద బయలదేరాను. గమ్యం నాకు తెలుసు.
------------
అణువణువునా నువ్వే అని తెలుసుకున్నాక.. కనిపించిన ప్రతీ లావణ్యాన్ని పలకరించాను. నీకు ఆకృతినివ్వడానికి బదులు, కనిపించిన ప్రతీ ఆకృతిలో నిన్నే వెతుక్కున్నాను.
------------
నాలో నేను ఓడిపోతూ ఎవర్ని గెలవాలి ?
------------
మనిషి హృదయం అద్దం లాంటిది అంటే నేను ఒప్పుకోను.. ఎందుకంటే, పగిలిన ప్రతీమారు అది అతుక్కుంటుంది.. అందుకే మళ్ళీ పగిలిపోతుంది.
------------
గుర్తు తెలియని చీకటిలో, విరజిమ్ముతున్న వెలుగునే కాదు.. కరిగిపోతున్న క్రొవ్వొత్తుని కూడా చూడు.
------------
బాధ కంటే బాధ పడుతున్నాం అనే భావనే ఎక్కువ బాధ పెడుతుంది.
------------
ప్రేమింపబడటం ఒక అదృష్టమేమో.. కానీ ప్రేమించ గలగడం ఒక వరం.
------------
నిన్న మొన్నటి అనుభవాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.. ఓటమి క్షోభ పెట్టిన క్షణాలు.. కాలంపై నా విజయాలుగా మిగిలిపోతాయి.
------------
నేను అనే పరిధి దాటి చూసాను ప్రభూ.. అంతా నీవే... నువ్వెక్కడున్నావ్ అని అడగడం మానుకున్నాను.
------------

Sunday, December 13, 2009

ఒంటరి గది

ఒంటరి గది...
గాలిని ఒంటరితనం ఆక్రమించుకున్న ఆ గదిలో, నిశ్శబ్ధం మాట్లాడుతుంది. అందుకని అలిగి మాట గొంతు మూగబోతుంది. గతాన్నే తలుచుకుని జ్ఞాపకం కంటనీరు పెట్టుకుంటుంది. 'నేను' అనే అస్థిత్వం నిట్టూరుస్తుంది. కాలం పడిలేస్తూ వెళ్ళిపోతుంది. జీవితం మాత్రం ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోతుంది. కిటికీ రెక్కల సందుల్లోంచి జారుకుని నా ఆలోచన ప్రపంచాన్ని చుట్టి వెనక్కి వస్తుంది నాకు ఎన్నో చెప్పాలని, నన్ను చూసినంతనే సర్వం మర్చిపోతుంది. నన్ను ఒంటరిగానే మిగిల్చేస్తుంది.. అయినా నా ఒంటరితనం నాతోనే వున్నప్పుడు నేను ఒంటరిని ఎలా అవుతాను ?
(పాత డైరీ లో కనిపించి పలకరించాయి, నేను ఎప్పుడో రాసుకున్న ఈ లైన్లు)

Wednesday, December 9, 2009

నేనూ.. నీ జీవితాన్ని..

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

క్షణానికోలా మాట్లాడ్డానికి నేను నీ మనసుని కాను..
నువ్వు పడినా, లేచినా.. ఆగక పరిగెట్టే కాలాన్ని కాను..
కాస్త ఓదార్పుకే ఆవిరైపోయి నిన్ను వెక్కిరించే కన్నీటినీ కాను..
రెప్ప పాటులో మాయమయ్యే నీ చిరునవ్వుని కాను.

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

చీకటిలో నిన్ను ఒదిలివెళ్ళిపోడానికి నేను నీ నీడను కాను..
కాస్త వెలుగుకే కరిగి చెదరిపోయే నీ కలనీ కాను..
అర్థం తెలియని గెలుపుని కాను.. పరీక్షించే ఓటమినీ కాను..
దూరాన మురిపించే గమ్యాన్ని కాను.. ముళ్ళతో బాధించే మార్గాన్ని కాను.

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

అనుక్షణం నీతోనే వుంటాను.. నీకు తోడుగా..
పడిపోతే పట్టుకుని లేపుతాను..ఓదారుస్తాను..
పరిగెడితే 'కాస్త జాగ్రత్త' నేర్పుతాను..ప్రేమగా..
నీ గమ్యమేమో గానీ.. దారిపొడవునా నా కాలిముద్రలే..
నేనుండగా నిన్ను ఒంటరిని కానివ్వను..
నేను లేని రోజుని నువ్వూ చూడవు..

నేను కఠినంగా వుంటే, కోప్పడు.. కానీ ద్వేషించకు..
నీ వెనుకే తిరుగుతున్నానని ఆట పట్టించు.. కానీ చులకన చేయకు..
నేను నీకు కేవలం 'జీవితాన్నే' కావొచ్చు..
కానీ నాకు నువ్వే 'సర్వస్వం'.
ఏదో ఒక రోజు మనిద్దరం కలిసే ఆగిపోతాం..
ఈలోగా నీ (నా) బ్రతుక్కో అర్థాన్ని మిగల్చడమే నాకు పరమార్థం...
అర్థం చేసుకుంటావు కదూ...

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

Monday, December 7, 2009

కరిగే లోగా ఈ క్షణం..

ఈ మధ్యే వచ్చిన ఆర్య-2 కి వనమాలి రాసిన 'కరిగే లోగా ఈ క్షణం..' పాట లోని ఈ నాలుగు లైన్లూ చాలా నచ్చాయి.

పరుగులు తీస్తూ అలసిన ఓ నదిని నేను..
ఇరు తీరాల్లో దేనికీ చేరువ కాను..
నిదురను దాటి నడిచిన ఓ కల నేను..
ఇరుకన్నుల్లో దేనికీ సొంతం కాను..

అలాంటి భావన్నే ఇలా కూడా రాసుకోవచ్చనిపించి.. (ట్యూన్ లో లేదనుకోండి..)

పరుగులు తీస్తూ అలసిన ఓ నదిని నేను..
తీరాల్ని కలపను.. వేరూ కానివ్వను.. కానీ..
ఎదురు నిలిచే ధైర్యమున్న మనసుకి వంతెనైపోతాను..
తనలో కలిపేసుకునే సాగరానికి సొంతమైపోతాను..


నిన్ను దాటి నడిచే నీ కలను నేను..
వెచ్చని కన్నీటితో రెండు కళ్ళనూ కలిపేస్తాను..
ఏ కన్ను తెరిచినా క్షణంలో కరిగిపోతాను.. కానీ..
నీలోని నాకు ప్రాణం పోసే నిదురలో మాత్రం కాసేపు నిజం అయిపోతాను..
నీ గుండెలో ఏమూలో జ్ఞాపకంగా మిగిలిపోతాను.

Wednesday, December 2, 2009

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ

సిరివెన్నెల రాసిన ఈ పాటనుంచి నేర్చుకోవాల్సింది చాలానే వుంది.

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ....

విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం...
అప్పుడే నీ జయం నిశ్చయం రా....
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ.....

నింగి ఎంత పెద్ద దైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా...
నింగి ఎంత పెద్ద దైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా....
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేదురా...
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...
నిశా విలాసమెంతసేపురా.... ఉషోదయాన్ని ఎవ్వడాపురా ...
రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా...

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ....

నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ...
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...
ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవును రా..
నిరంతరం ప్రయత్నమున్నదా... నిరాశకే నిరాశ పుట్టదా ...
నిరంతరం ప్రయత్నమున్నదా... నిరాశకే నిరాశ పుట్టదా ...
ఆయువంటూ వున్నవరకు చావుకూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటు రా.. ...

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ....

--- ఇంక నా లైన్స్ .. :-)

కష్టమైన, నష్టమైన, కాలమన్న ప్రవాహాన కొట్టుకుంటు ముక్కలవ్వదా..
వేదనెంత గాఢమైన, బాధ ఎంత తీవ్రమైన, రెప్ప పాటు గుండె ఆగునా ?
వేదనెంత గాఢమైన, బాధ ఎంత తీవ్రమైన, రెప్ప పాటు గుండె ఆగునా ?
కంటనీరు ఏరులైన, దూసుకెళ్ళే ఆశ ముందు ఓటమైన ఓడకుంటదా ?
చూపు మేర చీకటైన, దారి తప్పి ఒంటరైన, నీ ఊహకంటూ హద్దు లేదురా..
అనుక్షణం పరిశ్రమున్నదా.. విధిరాత ఐన మారకుండునా..
అనుక్షణం పరిశ్రమున్నదా.. విధిరాత ఐన మారకుండునా..
ఆగకుండా.. అలవకుండా.. సాగిపొయే నడక ముందు చేరలేని గమ్యమేదిరా..

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ .

Sunday, November 29, 2009

కర్తవ్యం

ఎందుకో ఈ రోజు, వూరంతా ఒకటే హడావిడి. ఎవరో స్వామీజీ వచ్చి రామాలయంలో సేదతీరుతున్నారంట, ఎన్నో మహిమలు చేస్తున్నారంట. ఈ వార్త వేగం గా వూరంతా ప్రాకి, ఎప్పుడూ గుడి మొహం కూడా చూడని జనాల్ని సైతం ఆలయానికి తీసుకువచ్చింది. ఏదిఏమైనా, భక్తి కంటే మహిమ బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఎవరైనా మానవాతీత శక్తులు చూపిస్తే, వాళ్ళు మన సో కాల్డ్ సమస్యలన్నిటినీ చిటికలో మాయం చేస్తారని ఒక ఆశ. సహజం. అదిమానవ నైజం. ఇందులో నిజానిజాలకి చోటు లేదు, కేవలం నమ్మకం, దాని వల్ల వచ్చే ఒక ధైర్యం, ఓదార్పు. ఏదైతేనేం, మొత్తానికి గుడి దగ్గర జన ప్రవాహం ఆగకుండా పెరుగుతూనే వుంది. స్వామీజీ మహిమలు కూడా వింతగావున్నాయి, ఆయన ఏ ఉంగరమో, వీభూదో సృష్టించడం లేదు, మంచి నీళ్ళు సృష్టిస్తున్నాడు.. దాహంగా వున్న అందరికీ. దాహం లేకుండా అడిగితే నీళ్ళు రావంట. బావుంది కదా కాన్సెప్ట్. ఎంత దూరాన వున్నా, ఆయన మాట్లాడేప్రతీ మాటా చివరన వున్న వారికి కూడా స్పష్టంగా వినిపిస్తోంది. వూరంతా వర్షం పడిన ఆ గంటా, ఆయనతో వున్న వారి మీద చినుకు కూదా పడలేదంట. మహిమలు సంగతి ప్రక్కన పెడితే, ఆయన ప్రతీ మాటా చెవిలో అమృతంపోస్తున్నట్టు వుంది. ఆయన చూపు, ఎంతటి అంధకారాన్నైనా వెలిగించేలా తీక్షణంగా వుంది. ప్రశాంతమైన చిరునవ్వు. ఆయన చుట్టూ ప్రోగైన జనాలు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు, పరిష్కారాలు అడుగుతున్నారు. కానీఇలాంటి ప్రశ్నలకి ఆయన నోరిప్పితే కదా. చిరు మందహాసమే సమాధానం. జనంలో అసహనం పెరుగుతోంది, మా ఊరి పెద్ద కూడా ముందు వరసలోనే వున్నాడు, ఆతనిదీ అదే పరిస్థితి. చివరకు అతనే ధైర్యం తెచ్చుకుని, మా వూరిప్రజల కష్టాలు తీర్చమని స్వామీజీ కి మరొక్కసారి మొరపెట్టుకున్నాడు. ఈసారి స్వామీజీ కొంచం కరుణించారు, ఎమిటా కష్టాలు అని అడిగారు. మా వాళ్ళు చిట్టా విప్పారు. మళ్ళీ మౌనమే సమాధానం. కాసేపటికి మట్లాడడం మొదలుపెట్టారు. ఆయనకి మా జనాలకి మధ్య సంభాషణ ఇలా జరిగింది.
స్వామీజీ : నన్ను మీరు చాలా ప్రశ్నలడిగారు, నేనూ ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. ఒక వేళ భగవంతుడే ప్రత్యక్షమై, అతను ఆదేశించిన పనిని మీరు చేస్తే, మొత్తం ప్రపంచాన్ని ఈ కష్టాలన్నింటి నుండీ దూరం చేస్తాను అని మాట ఇస్తే, మీరు ఆపనిని చేస్తారా ? అది ఎంత కష్టతరమైనా ?
ఒకడు : నేను చేస్తాను స్వామీజీ, అది ఎలాంటి పని అయినా..
మరొకడు : ప్రపంచం అంటే, మా వూరు కూడా కదా స్వామీజీ, నేనూ సిద్ధమే.
ఇంకొకడు : ప్రపంచాన్నే కష్టాలనుంచి కాపాడుతానంటే, నేను ఎలాంటి పని/శిక్ష కి అయినా సిద్ధం స్వామీజీ. నా శిరస్సు ఖండించినా సరే.. నన్ను నిలువునా పాతిపట్టినా..
ఇంకొకడు : నన్ను ఏ చెట్టుకో ఉరితీసినా.. నన్ను అగ్ని ప్రవేశం చెయ్యమన్నా... ఇంకొకడు : ఈ జనం అందరికోసం, నరకంలో వేసే శిక్షలన్నీ భరించడానికి నేను సిద్ధమే స్వామీ..
(ఇలా మా జనాలు ఒకరితరువాత ఒకరు, ఒకరికి తగ్గకుండా ఒకరు ప్రతిజ్ఞలు చేస్తూనే వున్నారు. స్వామీజీ అందరూ మాట్లాడిన తరువాత.. కాసేపటికి చిరునవ్వుతో ఇలా అన్నారు.. )
స్వామీజీ : ప్రజలారా, భగవంతుడు మీరు జీవించి వున్నంత కాలం ఆనందంగా ఉండమన్నాడు. అదే అతను మీకు అదేశించిన పని, కర్తవ్యం.
ఒక్క క్షణం అంతా కలకలం.. తరువాత అంతా నిశ్శబ్ధం. మా జనాలకీ అర్థం అయినట్టుంది.
(Inspiration from Richard Bach's Illusions)

Thursday, November 26, 2009

వీళ్ళనేం చేద్దాం!

వీళ్ళనేం చేద్దాం!

ఈ మధ్యే యండమూరి రాసిన ఈ పుస్తకం చదివాను. నా అభిప్రాయాల్ని అందరితో పంచుకోవాలని అనిపించింది. ఇది విశ్లేషణ కాదు, కేవలం నా స్పందన.

పుస్తకం మొత్తం మీద ఒక మోస్తరుగా అనిపిస్తుంది. చెప్పిన విషయాలు చాలానే వున్నా, మనసులోకి నాటుకుని గుర్తుండిపోయేవి కొన్నే. ఒక 'మంచి పుస్తకం' కన్నా, ఒక 'అబ్సర్డ్ థ్రిల్లర్' రాయాలనే తపనే ఎక్కువ కనిపించింది. పుస్తకం మాత్రం మొదలు పెట్టాక మొత్తం చదివించేస్తుంది, చదివిన ఒకటి రెండు రోజుల వరకూ ఒకింత ఆలోచింప చేస్తుంది కూడా. ప్రస్తుత సమాజానికి సరిగ్గా సరిపోయేటట్టు, అద్దం పట్టేట్టు వుంది. మొదట్లో కొన్ని పేజీలు 'అంతర్ముఖాన్ని' గుర్తుచేస్తాయి. (భగవంతుడు, ఆత్మలు వగైరా.. వగైరా..). ఇంక ఇతివృత్తం సంగతికి వస్తే, తప్పు దారిలోకి వెళ్ళిపోడానికి రెడీ గా వున్న ఒక రచయితని (భరద్వాజ), భగవంతుడు, అప్పటికే తనువు చాలించిన మరొక రచయిత (మహర్షి) ప్రమేయంతో సరైన దారిలోకి తేవడం. అసలు కధ చిన్నదే, కానీ కధనం కాంక్రీట్ గా వుంది, సమాజంలో కుళ్ళుని ఎత్తిచూపడానికి ఏ ఒక్క అవకాశం యండమూరి వదల్లేదు. కుళ్ళునే ఎత్తి చూపారు, అని చదివే మనసు అక్కడక్కడ రోదిస్తే ఆశ్చర్యం లేదు. అబ్సర్డ్ థ్రిల్లర్ అని చెప్పుకోడానికేమో కావాలని ఒక పేజీ (11వ పేజీ) ప్రింటింగ్ బాగా చెయ్యకపోవడం..మధ్యలో ఎక్కడో ఓ రెండు పేజీలు ఖాళీగా వుంచెయ్యడం కొంత వింతగా అనిపించింది. కొన్ని పాత్రలు, నిజ జీవితానికి మరీ దగ్గరగా వుండేటట్టు మలిచే అనవసరపు ప్రయత్నం కనిపించింది.(ముఖ్యంగా కాంట్రాక్టర్ రెడ్డి ది). రచయిత భరద్వాజ భార్య అతన్ని వదిలి పెట్టి వెళ్ళాకే అసలు కధ మొదలౌతుంది. అతని భార్య కి 'శాంతి' అని పేరు పెట్టడం చాలా అర్థవంతంగా వున్నట్టు అనిపిస్తుంది. భరద్వాజ తిరిగి తన శాంతిని పొందడంతో కధ ముగుస్తుంది.

చివర్లో భరద్వాజ ప్రసంగం హైలైట్ గా నిలవాలి, కానీ పేలవంగా సాగిందనే చెప్పాలి. నిజం గానే ఇలాంటి పుస్తకం రాయడమే ఒక రిస్క్, ఎందుకంటే రచయిత మరీ నిష్టూరంగా నిజాలన్నీ చెప్తానంటే కొన్నిసార్లు చదవడానికి వెగటుగా వుంటుంది. అది నిజమే అని మనకీ తెలిసినా ...

పాత్రలు ఆకట్టుకునేలానే వున్నాయి, కాని వాటి వ్యక్తిత్వాలు మనసుకి హత్తుకునేలా.. గుర్తుండిపోయేలా లేవు. కొన్ని వివరణలు 'ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారీ' పుస్తకానికి దగ్గరలో వున్నాయి. ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రాసిన యండమూరిది అని అనుకోకుండా చదివితే.. ఒక్కసారి చదవచ్చు.. ఖచ్చితంగా. మనం అండర్ లైన్ చేసుకుందామనుకునే లైన్స్ ని ప్రింటింగ్ లోనే బోల్డ్ లో ఇచ్చారు. మంచి ప్రయత్నం. పుస్తకం చివరన యండమూరి ఇంటర్వ్యూ ఎందుకు పెట్టేరో తెలీలేదు. 'ఆస్థి అనేది నువ్వు ఇతరులకు చూపించేది కాదు.. నువ్వు అనుభవించేది.. ', 'నువ్వున్నంత కాలం నీ విలువ లేదు.. నువ్వు లేని మరుక్షణం అది తెలుస్తోంది.' ఈ రెండు వాక్యాలు గుర్తుండిపోయాయి.

Tuesday, November 24, 2009

ముసుగు

'ముసుగులతో తిరిగి తిరిగి అద్దం లో నన్ను నేను పోల్చుకోలేకపోయాను'. ఎప్పుడో రాసుకున్న లైన్ ఇది. నిజంగానే, అందుకే ఏ కల్మషం తాకని చిన్నారి నవ్వు అంత అందంగా వుంటుంది, అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, ఎవరికోసం ఈ ముసుగులన్నీ ? ఎవరిని మోసం చేస్తున్నాం ?

నేనూ కల కంటాను..
హాయిగా మనస్పూర్తిగా నవ్వుకోవాలనీ..
ఓదార్పు ఆశించకుండా ఏడ్వగలగాలనీ..
ప్రతీ ఆనందాన్ని పంచుకుని పెంచుకోవాలనీ..
ప్రతీ కష్టం నుంచీ పాఠం తప్పక నేర్చుకోవాలనీ..
నేనూ కల కంటాను..
నాతో నేను నిజాయితీగా మట్లాడుకోగలగాలనీ..
క్షణాలన్నింటినీ జ్ఞాపకాలుగా గుండెలో దాచేసుకోవాలనీ..
నేనూ కల కంటాను..
నన్ను నేను గెలవాలనీ.. గెలుస్తూనే వుండాలనీ..
ఎక్కడో యండమూరి రాసారు, సున్నితత్వం అంటే చిన్న చిన్న విషయాలకు బాధపడటం కాదు.. ఆనందించడం అని. నిజమే హాయిగా నవ్వుకోవడానికి ఎంత ధైర్యం,ఆత్మవిశ్వాసం కావాలి ? :-)

Tuesday, November 17, 2009

ఎంత సులువు..

ఈమధ్య నేనొక పెద్దాయన్ని కలిసాను. ఆయనకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఎక్కడో విదేశాల్లోనూ, ఇంకొకరు ఢిల్లీలోనూ సెటిల్ అయ్యారంట. ఈ పెద్దాయన మాత్రం ఇక్కడ ఒంటరిగా వుంటున్నారు. పిల్లల దగ్గరకు వెళ్ళినా చుట్టం చూపుగానే. ఆయన అన్న ఒక మాట ఎందుకో నన్ను బాగా ఆలోచింపచేసింది. - "మా తమ్ముడు పిల్లలు పెద్దగా చదువుకోలేదు. ఎవో చిన్న చిన్న వుద్యోగాలు ఇక్కడే చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఆనందంగా వుంటుంటే చూసి ఇప్పుడు నేను విచార పడుతున్నాను మా పిల్లల్ని అంత కట్టడి చేసి ఎందుకు చదివించేనా అని. ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను,... నేను గెలిచేనా ? ఓడిపోయానా ? అని."
ఆయన అన్న మాట ఎంత ప్రాక్టికలో గాని, ఆ మాట వెనుకు దాగున్న వేదన మాత్రం నన్ను బానే డిస్టర్బ్ చేసింది. దాదాపుగా ఈ కాంటెక్స్ట్ లోనే ఆ మధ్య రాసుకున్న లైన్స్ ని మళ్ళీ నాకు గుర్తు చేసింది.
పిల్లలే లోకం గా వాళ్ళ జీవితాలనే అర్పించి, పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులు వాళ్ళ వృద్ధాప్యం అంతా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే, సాధించిన ఏ అభివృద్ధిని చూసి నేను మీసం మెలేయాలి ? ఇల్లు చిన్నగా వున్నప్పుడే బావుండేది, అమ్మ చెయ్యి ఎప్పుడూ నాకు తగులుతూనే వుండేది. కలలో కూడా.. ఇప్పుడు.. ఇళ్ళు విశాలమయ్యాయి, కానీ కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఎవరి లోకం వారిది. చివరికి చిన్న కొడుకుని, పెద్ద కూతురిని ఫొనుల్లోనే చూసుకుంటున్నాం.

ఎంత సులువు, నాకే అందనంత ఎత్తులో వున్న
నా కను పాపను చూసి గర్వపడడం..
నాకు చూపు లేకపోయినా..
ఎంత సులువు, నిద్ర లేని రాత్రులన్నింటినీ
జ్ఞాపకాలతో తడిపేసుకుని,
చిరునవ్వుతో తెలవారడం.
ఎంత సులువు, ఓదార్పు కి భయపడి,
కన్నీటిని ఎక్కడో గుండె పలచటి పొరల్లో దాచేయ్యడం..
ఎంత సులువు, జీవితపు చివరి మజిలీలో,
అందరూ వుండీ ఒంటరైపోవడం...
పోటీ ఎవరిమధ్యోగానీ,
నేనే గెలిచాను అనుకుని తృప్తిపడడం...
ఎంత సులువు, .. ఎంత సులువు...

Friday, November 13, 2009

దేశమును ప్రేమించుమన్నా

గురజాడ వారు రాసిన ఈ గేయం ఈ మధ్యే వందేళ్ళ పండగ జరుపుకుంది. మనసు పెట్టి చదువుతుంటే, ప్రతీ అక్షరం ఇప్పటికీ, ఎప్పటికీ అర్థవంతంగా, అద్దం పట్టేలానే అనిపించింది. ఇలాంటి మహానుభావులు పుట్టిన ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వంగా వుంటుంది, ఇంతలో సాయంత్రం సరదాగా టీవీ పెడితే వచ్చే న్యూస్ చూసి హృదయం సిగ్గుతో కుచించుకుపోతుంది. ఎంతమంది గురజాడలు, శ్రీశ్రీలు కావాలి నేటి సమాజానికి ?

దేశమును ప్రేమించుమన్నా,
మంచి యన్నది పెంచుమన్నా;
వట్టి మాటలుకట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్ట వోయ్!
పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్ ;
తిండి కలిగితెకండ గలదోయ్
కండ గల వాడేను మనిషోయ్ !
ఈసురో మని మనుషు లుంతే
దేశ మేగతి బాగు పడునోయ్ ?
జల్దు కొని కళ లెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్!
అన్ని దేశాల్ క్రమ్మ వలెనోయ్
దేశి సరుకుల నమ్మ వలెనోయ్ ;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !
వెనక చూసినకార్య మేమోయ్ ?
మంచి గతమున కొంచెమేనోయ్
మంద గించక ముందు అడుగేయ్ !
వెనక పడితే వెనకెనోయ్ !
పూనుస్పర్ధను విద్య లందే
వైరములు వాణిజ్య మందే ;
వ్యర్ధ కలహం పెంచ బోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !
దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పు కోకోయ్
పూని యేదై నాను వొక మేల్
కూర్చి జనులకుచూపవోయ్ !
ఓర్వలేమి పిశాచి, దేశం
మూలుగులు పీల్చేసెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !
పరుల కలిమికి పొరలి యేడ్చే
పాపికెక్కడ సుఖం కద్దోయ్ ?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !
స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడు పడవోయ్ !
దేశ మంటే మట్టి కాదోయ్,
దేశ మంటే మనుషులోయ్ !
చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్థు లంతా నడవ వలెనోయ్,
అన్న దమ్ముల వలెను జాతులు
మతము లన్నీ మెలగ వలెనోయ్ !
మతం వేరై తేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్ !
దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్,
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండ వలెనోయ్ !
ఆకు లందున అణగి మణగీ
కవిత కోయిలపలుక వలెనోయ్
పలుకులను విని దేశమం దభి
మానములు మొలకెత్త వలెనోయ్ !

Tuesday, November 10, 2009

మేలుకో

మేలుకో మధ్యతరగతి మేలుకో,
ఆరు దశాబ్ధాల స్వాతంత్ర్యాన్ని అనుభవించావు కలల్లోనే,
ఇకనైనా కళ్ళు తెరు.
పైతరగతి సంపదను, స్వాతంత్ర్యాన్ని అనుభవించింది.
క్రింది తరగతి సబ్సిడీని, స్వేచ్ఛని అనుభవించింది.
ఏం మిగిలింది నీకు ?
నీ చూపు నీ ఇల్లు దాటదు,
నీ లెక్క నీ ఆదాయాన్ని దాటదు,
ఇంకా ఎన్నేళ్ళు ఈ 30 రోజుల జీవితాలు ?
సమాజం అంటే కేవలం భాధ్యతే కాదు,
నీ హక్కు కూడా,
వ్యవస్థ కోసం నువ్వు కాదు,
నీకోసం వ్యవస్థ. గ్రహించు.
తలాడించింది చాలు.తలెత్తి ప్రశ్నించు.
అడవుల్లో ఆగిపోయే విప్లవాలు,
సభల్లో హోరెత్తే వాగ్ధానాలు,
ఏవీ మార్చలేవు నీ బ్రతుకుని.
నీ రేపునీ, రాబోయే తరం తలరాతనీ,
మార్చగలిగేది నీ దృక్పధమే.
ఏ చరిత్ర పుస్తకంలోనూ లేదు,
నీ గతానికి కనీసం ఒక పేజీ.
నీ పన్నుపోటు పెంచే ఏ ప్రణాళికలోనూ లేదు,
నీ రేపుకి ఒక దిక్సూచి.
నువ్వు మాత్రం రోజూ ధారపోస్తావు,
చమటనీ, కన్నీటిని,
తాకట్టుపెడతావు తెగువనీ,తెలివితేటలనీ.
నీ కలలు ప్లాస్టిక్ చిరునవ్వుల రియాలిటీషోలు..
నీ ఆశలు ఆకాశాన్ని తాకాలనే కెరటాలు.
ఇంకా ఎన్నిరోజులు బ్రతుకుతావు..
ఇలా రోజూ చస్తూ ?
మేలుకో..
సహించింది చాలు.. సమాధానం అడుగు.
అంగీకరించింది చాలు.. అధికారం అడుగు.
నీ భవిష్యత్తుని శాసించు.. నిర్మించు.

Saturday, October 31, 2009

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ.

(ఆంధ్రా తెలుగు తల్లి వేరు, తెలంగాణా తెలుగు తల్లి వేరు, అని నిన్ననే తెలుసుకున్నాను. శ్రీకాకుళం తెలుగు తల్లి, విశాఖ తెలుగు తల్లి కూడా వేరు, వేరు అని తెలుసుకునేలోపు, ఒక్కసారి ఈ గేయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని. చదివినందుకు ధన్యవాదాలు.)

మేఘమా (ప్రయాణం)

నిన్న రాత్రి, టీవీ లో ప్రయాణం మువీ వచ్చింది. అమృతవర్షిణి పాడిన 'మేఘమా' పాట విని కొంచం ఆవేశపడి ఒక నాలుగు లైన్లు రాసుకున్నా. పెద్దగా అర్థం లేకపోయినా, ట్యూన్ లో పాడుకునేలా. :-)

స్నేహమా సాగాలమ్మా ప్రేమగా ఒదుగుటకు.
కాలమా ఆగాలమ్మా శ్వాసగా కరుగుటకు..

రాతిరంతా.. గుండెలోని గాయం కంటనీరై వర్షిస్తుంది.
మాటరాక గొంతులోని రాగం జ్ఞాపకం గా లాలిస్తుంది.

Thursday, October 29, 2009

కవిత

ఓ రెండు బొట్ల అనుభూతి చాలదూ నేను కదలడానికి..ఏదో ఒకటి రాసుకుందామనిపిస్తుంది.. కానీ మళ్ళీ కొత్తగా ఏం రాయను ?చదివే ప్రతీ కంటికీ ఏంకావాలో నాకేంతెలుసు ?ఎంత నిట్టూరిస్తే మాత్రం.. నా బాధ నీకు అర్థమౌతుందా ?కన్నీళ్ళు అందరివీ వెచ్చగానే వుంటాయి.. కాని కలలు వేరు కదా... అయినా నువ్వు నా అక్షరాలే చదువుతానంటే.. నా నిశ్శబ్ధాన్ని ఎలా చెప్పను నీకు... నీతో మట్లాడాలనే వుంటుంది నాకు..కానీ నీతో మట్లాడితే నాకు నేను గుర్తొస్తానే.. .అదే భయం.. రాసుకున్న నాలుగు లైన్లూ చూసి.. ఇది కాదే చెప్పాలనుకున్నది .. అనిపిస్తుంది..ఎంచెయ్యను.. కాగితాల్ని చింపెస్తాను లే.. నాకు కనిపించకుండా...కాని అక్షరాల్ని ఎలా ముక్కలు చెయ్యడం.. అవి నన్ను వెక్కిరిస్తూనే వుంటాయి.నేను ఏడ్వకుండానే.. నువ్వు ఓదారుస్తావు.. నాకే నేను అర్థం అవ్వకపోయినా.. నీకు అంతా అర్థం అయ్యిందంటావ్..ఇదెక్కడి అన్యాయం..అయినా నీకు నేనంటే ఎందుకంత లోకువ..నా ఒంటరితనం నీకు కవిత్వం లా కనిపిస్తుంది.కన్నీరేమో కావ్యం అంటావ్.. నవ్వితే హరివిల్లంటావ్..నవ్వకపోతే సముద్రం అంటావ్.నేనేమైనా ప్రకృతిని అనుకున్నావా..ఎందుకు నేనంటే నీకు అంత అలుసు..నువ్వు నన్ను కవితా అని పిలవక్కర్లేదు.. నాకూ ఒక గుండె ఉందని ఒప్పుకో చాలు.. దాని రెప్పల సవ్వడి ఎప్పుడైనా విను. చాలు.

Saturday, October 24, 2009

సరదాగా నాలుగు లైన్లు

అలసిపోయిన ఆలోచనకి ఒంటరితనం - ఒక ముసుగు.
---
తెల్లారిపోయిన కలలకు స్వాగతం చెప్పేది - బెడ్ కాఫీ.
---
గెలిచాకే అర్థం అయ్యింది - నిన్నటి ఓటమి.
---
మచ్చలేని వ్యక్తిత్వాన్నీ నేలపాలు చెయ్యగలిగేది - స్వార్థం.
---
ఎంత సంపదతో అయినా వెలకట్ట లేనిది - అమ్మ చిరునవ్వు.
---
అక్షరాలే లేని అద్భుత పుస్తకం - అద్దం.
---
అన్ని ఋతువుల్లోనూ వర్షించేది - కన్నీరు.
---
చల్లని వెన్నెల్లోనూ గుండెను మండించేది - అసూయ.
---
సగటు జీవికి చివరికి మిగిలే fixed deposit - జ్ఞాపకాలు.
---
తలదించుకుంటే తప్పు నాదే అంటుంది - సమాజం.
---
జీవితమే అర్పించేసినా ఇంకా చెయ్యాలనిపించేది - ప్రేమ.
---
రాసిన నాలుగు లైన్లకీ ఎమిటా సంబంధం అని విచారిస్తోంది - నా బ్లాగు. :-)

Friday, October 16, 2009

దీపావళి

దీపావళి - నెల రోజుల ముందునుండే హడావిడి మొదలయ్యేది. మందుగుండు సామాను కొనడం, ఎండబెట్టడం, మతాబులు, చిచ్చు బుడ్లు తయారుచేసుకోవడం. ఒక్కొక్కరికీ ఇన్ని అని లెక్క పెట్టి మరీ చేసుకునేవాళ్ళం. స్కూల్లో కూడా ఇవే కబుర్లు. ఈ అంకం ముగిసాక మొదలయ్యేది కొత్త బట్టల సందడి. అప్పట్లో ఈ రెడీమేడ్స్ ఇంత ప్రాచుర్యం పొందలేదు, బట్టను తానుల్లోంచి తీయించి, ఆస్థాన టైలర్ కి ఇచ్చి, వాడు ఆ పండగ సీసన్ బిజీ లో ఎప్పుడు కుడితే అప్పుడు, ఎలా కుడితే అలా, మహా ప్రసాదం అనుకుని తీసుకునేవాళ్ళం. ఈ హడవిడి ల మధ్య పండగ రానే వచ్చేది. ముందు రోజు రాత్రంతా మనసు కొత్త బట్టల మీదే వుండేది. ఎప్పుడు తెలవారుతుందా.. ఎప్పుడు వేసుకుందామా అని. నిద్ర పడితే వొట్టు. ఎదో మొత్తానికి లేచామనిపించి, తలంటు స్నానానికి కూర్చునేవాళ్ళం. అప్పట్లో ఇంకా ఈ షాంపూ సొబగులు తెలీవనే చెప్పాలి. కళ్ళు మండుతూ, వేన్నీళ్ళతో తలంటు స్నానాలు. తరువాత పసుపు పెట్టిన కొత్త బట్టలు, పిండి వంటలు.. వచ్చే పోయే అతిధులు, నిజంగా మన పండగలు ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇంక సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని వైటింగ్. మళ్ళీ త్వరగా స్టార్ట్ చేస్తే అందరికంటే ముందే మన టపాసులు అయిపోతాయని దిగులు. సో కాస్త లేట్ గా స్టార్ట్ చేసే వాళ్ళం. 'దుబ్బు దుబ్బు దీపావళీ' అంటూ. కాకరి పువ్వొత్తులు, మాతాబాలు, చిచ్చు బుడ్లు, భూ చక్రాలు, విష్ణు చక్రాలు, ఎన్నో వెరైటీ లు. కుటుంబం అంతా కలిసి దీపావళి చేసుకోవడం నిజంగానే ఒక అపూర్వ ఘట్టం. ఒక పెద్ద కర్రకి చివర కాకర పువ్వొత్తుని పెట్టి చిచ్చు బుడ్లు వెలిగించడం, జాగ్రత్తకు పరాకాష్ట. :-) కొన్ని గంటల వరకూ ఈ సందడి వుండేది. మిఠాయి పొట్లాలు, టపాసులూ ఖాళీ అయ్యే వరకూ. ఆ అమావాశ్య, వెన్నెల రాత్రిలా మెరిసి పోయేది, మురిసి పోయేది. ఎప్పుడు తెలవారేదో కానీ, ఇంటింటి ముందు ఒక పెద్ద కాల్చేసిన టపాసుల కుప్ప వుండేది, ఎవరి ఇంటి ముందు పెద్ద కుప్ప వుంటే వాళ్ళు గొప్ప అన్నమాట.

ఆ జ్ఞాపకాలను తలచుకుంటేనే హృదయం బరువెక్కిపోతుంది. నాగరికతో, మరొకటో, ఆ స్వచ్ఛమైన ఆనందాల నుంచి చాలానే దూరం వచ్చేసామేమో అనిపిస్తుంది ఇప్పుడు. రేపే దీపావళి, ఇంకా రేపు ఉదయం వెళ్ళి ఓ రెండు కాకరపువ్వొత్తులు కొని సాయంత్రం కాల్చామనిపించేస్తాం. ఏ 'పొకిరీ' తోనో, 'అష్టా చమ్మా' తోనో పండగ గ్రాండ్ గా అయ్యిందనిపిస్తాం.

anyways.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

B'Day

జీవితం ఇంకో అడుగు ముందుకేసింది. కాలం తనకు మాత్రమే తెలిసిన గమ్యం దిశగా సాగిపోతోంది. బాల్యం వరం, యవ్వనం పరుగు, వృద్ధాప్యం జ్ఞాపకం. ఈ దశలన్నింటినీ ఒకే రోజులో చూపించగలిగేది జీవితం. ఎక్కడో చదివాను, వ్యక్తిత్వాలు, దృక్పధాలు మార్చడానికి పెద్ద పెద్ద సంఘటనలేమీ అక్కర్లేదు, ఒక్క తెల్ల వెంట్రుక చాలు అని. :-) నిజమేనేమో.

ఏం సాధించావు ? అని అడిగితే, పంచిన చిరునవ్వుల లెక్కే చెప్పుకుంటాను. ఏం సాధించాలనీ ? అని అడిగితే, ఆగకుండా సాగిపోవడమే అన్నది నా సమాధానం. నిజమో అబద్దమో కానీ, జీవితం క్షణికం మాత్రం కాదు, దాని ముగింపే క్షణికం. లెక్కకు అందని అనుభూతుల, అనుభవాల సమ్మేళనం అది. కాలం అనే ఉలితో ఎంతో నైపుణ్యంతో చెక్కబడిన శిల్పం అది. అందుకే నాకదంటే గౌరవం.

Monday, October 5, 2009

వ్యత్యాసం

డబ్బు సుఖాల్ని ఇస్తుంది, ప్రేమ ఆనందాల్ని ఇస్తుంది.
జీవితానికి ఈ రెండూ అవసరమే..
వాటి మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోవడం ఇంకా అవసరం.

Sunday, October 4, 2009

ఒక్క ఆలోచన

ఒక్క ఆలోచన ఓటమిని గెలుపుగా మర్చేస్తుంది..
ఒక్క ఆలోచన ఒంటరితనాన్ని ఏకాంతం చేస్తుంది..

ఒక్క ఆలోచన చీకటిని వెలిగిస్తుంది..
మౌనాన్ని వినిపిస్తుంది.

ఒక్క ఆలోచన, ఆగిపోయిన నన్ను తిరిగి నడిపిస్తుంది..
అసలు గమ్యం గుర్తుచేస్తుంది..

ఒక్క ఆలోచన, కన్నీటిని జ్ఞాపకం చేస్తుంది..
నిన్ను ని నా జీవితం చేస్తుంది.

ఒక్క ఆలోచన, నన్ను పుట్టిస్తూనే వుంటుంది..
మళ్ళీ.. మళ్ళీ..

పంచదార బొమ్మ

పంచదార బొమ్మ (మగధీర) లో చరణం - hats-off to chandra bose!

గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా ?
గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది..
ఏమిటంట నీలోని గొప్ప ?

వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది,
పక్షపాతమెందుకు నా పైన ?
వెలుగు దారి చుపింది, చినుకు లాల పోసింది,
వాటితోటి పోలిక నీకేల ?

అవి బ్రతికున్నప్పుడె తోడుంటాయమ్మా ..
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా ....

ఇక నా lines (though not in the tune).

గాలి ఊపిరికి నిట్టూర్పు వుంది..
నేల తల్లికి ఆ నింగి వుంది..
కాని.. నాకు నువ్వే లోకం..
నువ్వు లేని లోకం శూన్యం..

వాన చినుకు మట్టిలో ఇంకి పోతుంది..
వెలుగు చీకటిలో కలిసిపోతుంది..
కాని... నాకు నువ్వే గమ్యం..
నీతోనే నాకు అంతం.

Tuesday, September 29, 2009

Happiness

For most of life, nothing wonderful happens. If you don't enjoy getting up and working and finishing your work and sitting down to a meal with family or friends, then the chances are you're not going to be very happy. If someone bases his [or her] happiness on major events like a great job, huge amounts of money, a flawlessly happy marriage or a trip to Paris, that person isn't going to be happy much of the time. If, on the other hand, happiness depends on a good breakfast, flowers in the yard, a drink or a nap, then we are more likely to live with quite a bit of happiness.
- Andy Rooney

Monday, September 28, 2009

అమ్మ

ఎక్కడో చదివాను, తెలుగు భాషలో అత్యంత అందమైన పదం 'ప్రేమ' అని..
అంతకంటే అందమైన, తీయనైన పదం నాకు తెలుసు . . . అది - 'అమ్మ'.

Thursday, September 24, 2009

కోపం. . ద్వేషం

ఎదుట వ్యక్తి మీద మనకున్న కోపం ఆ వ్యక్తిని మనకి దూరం చేస్తుంది..
ఎదుట వ్యక్తి మీద మనకున్న ద్వేషం మనల్నే మనకి దూరం చేస్తుంది.

మన మీద మనకున్న కోపం ఆనందాన్ని దూరం చేస్తుంది.
మన మీద మనకున్న ద్వేషం.... నా దృష్టిలో మరణంతో సమానం.

ఎంత బావుణ్ణు...


ఎంతటి బంధమైనా.. ఒక్క చిన్న అపార్థం చాలు ముక్కలవ్వడానికి,
ఎంతటి జీవితం అయినా.. ఒక్క చిన్న అనర్థం చాలు తలక్రిందులవ్వడానికి.

ఒక్కోసారి జ్ఞాపకాలే మనసుకి భారమైపొతాయి.. నిజాయితీగా నిలదీస్తాయి,
మనసుని "Restart" చేసుకునే సౌకర్యం వుంటే ఎంత బావుణ్ణు.

మలుపులు తిరిగి తిరిగి జీవితం బయలుదేరిన చోటుకే వస్తుంది అలసిపోయి,
ఏ కలలోనో భగవంతుడు ఇదీ నీ "Destiny" అని చెప్పేస్తే ఎంత బావుణ్ణు.

Thursday, September 17, 2009

పదిమంది

మన చుట్టూ వున్న పదిమంది మనం చేసే పనినే చూస్తున్నారనుకోవడం...
అమాయకత్వం..
ఆ పనిని ఎల్లప్పుడూ వారందరికీ నచ్చేటట్టు చెయ్యాలనుకోవడం..
మూర్ఖత్వం.

పరీక్షలు

జీవితం లో పరీక్షలు తప్పవు నేస్తం,

కానీ ఎన్ని ఎదుర్కున్నామని కాదు, ఎంత నేర్చుకున్నామని ?
ఎంత ఆలోచించామని కాదు, ఎన్ని అమలుపరిచామని ?

ఎన్ని కలలు కన్నామని కాదు, ఎన్ని సాకారం చేసుకున్నామని ?
ఎంత జీవించామని కాదు, ఎంత అనుభవించామని ?

ఒకరికొకరం ఎంత కావాలనుకున్నామని కాదు, ఎంత అంగీకరించగలిగామని ?
ఎంత అనుభూతికి లోనయ్యామని కాదు, ఎంత పదిలపరచుకున్నామని ?

Wednesday, September 16, 2009

ఒంటరితనం

మనిషి జీవితంలో మరణం కంటే భయంకరమైనది ఒంటరితనం..
మరణం ఒకేసారి వస్తుంది. కానీ ఒంటరితనం అనుక్షణం చంపుతుంది.

Monday, September 14, 2009

without ...

Naaku nachchina konni lines ...

Without pain, we would not experience love.
Without silence, we could not appreciate our words.
Without weakness,our strength would be obsolete.
Without tears, our laughter would never be heard.
Although we may all face hardships in our life,
We must remember that serenity is born through strife.

antha maya!!

antha maya!!
monneppudo oka roju kalalo, nenu uttar pradesh vellanu. city peru sarigga gurthu ledu. railway station lo digina naaku oka porter swagatham cheppadu. luggage theesukunnadu naa permission lekundaane, nenu athani moham kooda choodakunda venaka parigettanu. station bayataku vachchina naaku, dabbulu isthunte enduko porter mukham lo mayavathe kanipinchindi. ikkada modalayyina ee shock, auto lo... hotel reception lo.. madyahnam lunch appudu.. prathee chota ee shock e.. ekkada choosina maye!!! aa debbatho naa kala kaastha kalaviranthaho "the end" ayyinndi. sarigga adedo ad lo anni veshallonoo rani mukharjee kanipinchinnattu. okka mayavathi ni chooddame kashtam.,.. mari intha mandi ante aalochinchukondi naa paristhithi..
paristhithi choosthunte, naa kala nijam ayye roju entho dooram lo ledane anipisthondi. endukante, mayavathi thana vigrahaalatho moththam uttar pradesh ni nimpese prayathnam lo vundi. deeni meeda ippatiki kharchu pettina moththam sumaruga, 1200 kotlu, moththam kharchu inkaa inko 2 vela kotlu vunde avakaasam vundi. thana swaprayojanala kosam, adhikaaram kosam, jaanalani vupayoginchukuni, prajaswamyam lo vunna konni fundamental weakeness ni margam ga malachukuni adhikaaraniki vachchina ilaanti raajakeeya naayakulaku, vaalla vigrahalani pettukune neithikamaina hakku asalu vunda ? puttina ventane vundalsina kaaneesa vasathulu leka maraninche sisuvulu manadesam lo velallo vunnaru.. rojooo... thagadaaniki neellu leni gramaalu lakshallo vunnnayi. ilaanti desam lo naayakulu valla vigrahalatho voollanu nimpesthe, manaki inka road lu kooda migalavu. mari manakunna nayakulu antha mandi.. okasaari otu vesi gelipinchina paapaaniki aidellu veellu chese prathee cheththa manam bharinchalsindena ? raaboye tharalaaki gandhi nehru vigrahaalu peddaga kanipinchakapovachchu. hathyalu manabhangalu chesi jaillonche poti chsina MLA lu, MP lu ennukunna purushoththamulu (lady ni emanalo theleedu naku, may be sthreeoththamulu) e thaarasapadathaaru prathee center lo. indulo oke oka vupayogam kanipisthondi naaku, veedullo thirige rowdeelu, dongalu, ilaanti vallandarikee manchi motivation ga vuntundi ilaanti vigrahaalni choosthe. mana voorlo laaga, UP lo ee vigrahaalu kaneesam land mark krinda kooda paniki raavu endukante antha maye kada mari.
janam gundello padilamayina naayakudu, raaboye tharaalaku margadarsakudiga vundalani anukunta ee vigrahaalu asalu pettedi. votloo.. seat lu.. koni padavulloki vachchi dorikina thaatiki dochukuni thintunna ee nayakulu, evadabba sommani ee kharchu peduthunnattu. asalu vinta eppudante, tharuvatha adhikaaram loki vache naayakulu ee vigrahaalanu tholagisthaamani appude prakatinchesaaru kooda. daaaniki enni kotlu kharchu pedathaaro.
naaku oka idea vachchindi, ee vigrahaalanu cheththa kundeelaga vupayoginchukune saukaryam vunte bahu baaguntundani. ante avamaaninchadam kaadu, mana cheththantha valla badhyatha ani cheppdam anthe.
guddilo mella, antha kharchoo dadaapuga pettesaka, inka aapandantoo supreme court ichchina judgement.
edi emaina, eppudo srikrishnudu arjuniditho "idi antha maaye" ante edo anukunnanu. ippdu artham ayyindi. :-)

Friday, September 11, 2009

Vijayam

"manakantoo oka vyakthithvam vundaali,... nenu nammuthaanu,...jeevitham ante nannu nenu thelusukovadame,... thappani malupulu,.... anugunamgaa nannu maarche paristhithulu,.. prema, athmeeyatha, aanandam,.... anthenaa jeevitham,... kaademo,.... jeevitham ante,, mana meeda manakunna nammakam,,.. manam chesthunnadi correct ane aathmavishvaasham,,.. manakantoo oka gamyamundaali,... ade manalni nadipisthundi sariayina daarilo... dikku thochaka madhya daarilo vundi poyina naaku naa vyakthithvame daari choopinchindi,..
edo kolpothanemo ani bhayamesthundi,..... malli pondagalanane nammakame nannu nadipisthundi.. ayinaa pondadam lo kanna ivvadam lone aanandam vundi kada,.. ani saripettukuntaanu..
kanta neeru veliki vochchina kshanaana kooda nenu bhaadhapadaledu,... edo nerchukunna anubhoothe migilindi...
nenu nenu gaa nilabadaalannade naa gamyam,.. anduku nenu peddagaa thyaagaalevee cheyyanakkarledu... prathi kshanam, kaanukagaa thechche anubhavaalni artham chesukunte chaalu,....
aakaashaanni andukodaaniki alalani saayamadaganu nenu....
nenu oka vyakthigaa edigi, naa bhaavaalatho sajeevam gaaa nilabadina roju anipinchindi... premimpabadatam lo kanna preminchadam lo aanandam vunnadanee,...pondadam lo kanna ivvadam lo aanandam vunnadanee...
naa chuttoo vunna padimandi naa valana aanandam ga vunna kshanam,,, ade vijayamanukunnaanu,.... nijamenemo,.... nijamenemo... "

Ekkado chadivaanu ...
To laugh often and much;
To win the respect of intelligent people and the affection of children;
To earn the appreciation of honest critics and endure the betrayal of false friends;
To appreciate beauty;
To find the best in others;
To leave the world a bit better,whether by a healthy child, a garden patchor a redeemed social condition;
To know that even one life has breathed easier because you have lived;
This is to have succeeded.

Wednesday, September 9, 2009

Test match

Eee madhye pelli ayyina naa close friend ni adiganu, how is life ani.. this is the reply i got.

"Life is like a test match, first innings we can score freely and slog whenever, the aim is to get a winning total; Second innings we have to stick to the plan, play safe so that atleast we will end up with a draw. Only good thing is, draw in life is a win for both sides :-)"

Interesting answer kada!!

Tuesday, September 8, 2009

I've learned that . . .


Naaku nachchina konni lines ..
I've learned that it takes years to build up trust and only seconds to destroy it.
I've learned that it's not what you have in your life but who you have inyour life that counts.
I've learned that you shouldn't compare yourself to the best others can do, but to the best you can do.
I've learned that it's not what happens to people that's important. It'swhat they do about it.
I've learned that it isn't always enough to be forgiven by others.Sometimes you have to learn to forgive yourself.
I've learned that no matter how bad your heart is broken, the world doesn't stop for your grief.
I've learned that our background and circumstances may have influenced who we are, but we are responsible for who we become.
I've learned that just because two people argue, it doesn't mean they don't love each other. And just because they don't argue, it doesn't mean they do.
I've learned that it's hard to determine where to draw the line between being nice and not hurting people's feelings and standing up for what you believe.

Thursday, September 3, 2009

3rd Sept

ప్రజల గుండెల్లో చెరగని వెలుగైన నాయకుడు అర్ధాంతరంగా అస్తమించాడు..
ఎంతటి మహారాజైనా మరణం ముందు మనిషి మరొక్కసారి బలహీనుడే అయ్యాడు.
కాలం అన్నింటినీ మరపిస్తుంది..
కానీ, కొందరి జీవితాలు చరిత్ర గా ఎప్పటికీ మిగిలిపోతాయి.

oka aalochana

"repu patla aashakthi vundaalante ee roju ni manaku nachchinattu gadapagalgaali,.... appude repu nunchi emayinaa aashisthaam,,... anthaaa naaku nachchinatte vundadu,.... angeekarinchaali,.. kaani entho kontha nenu anubhavinchaali,..... svechchagaa,... appudapudu oka chinna aalochane naa hrudayam nindaa chaithanyaanni nimputhundi,... aa aalochana, naaku aa dyvamichchina varamanukuntaanu,... andam prakruthilo ledu,... choose kallaki theliyaali,... adi andamani,,. aanandam kshanaallo ledu,... spandinche hrudayaaniki theliyaali,... alaa anubhavinchaalani,,.. alaaa anubhavinchaalani,..... kallalo velugunu, kanneetilo chirunavvunu nimpukunte,... anuvanuvunaa veluthure,.... prathi kshanamu aanandame,.....repu nilachi vunnantha kaalam nenu otamini oppukonu.. aa repe leni rojuna naa gelupu otamulaku thedaane ledu"

Sunday, August 30, 2009

గమ్యం

నువ్వు నాతో వున్నంత సేపు,నువ్వు వున్నావనే ఆనందం కన్నా,.
నువ్వు మళ్ళీ దూరం ఆయిపోతావేమో అనే భయమే ఎక్కువ వుంటుంది.

నువ్వు దూరమైనప్పుడు, నువ్వు లేవు అనే బాధ కన్నా,..
మళ్ళీ కలుస్తామనే ఆశే ఎక్కువ వుంటుంది..

ఒక్కోసారి, అసలు నువ్వు వున్నావా ? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను..
కానీ నువ్వు లేకపోతే నేనూ లేను కదా.. అని ఓదార్చుకుంటాను..

నువ్వు మరీ చేరువ అవ్వకు... అలా అని మరీ దూరమూ అవ్వకు..
నాకు కనిపిస్తూ వుండు .. నన్ను నడిపిస్తూ వుండు .. చాలు.
(Note - ee poem lo "nuvvu" ki artham "Gamyam - The Destiny", just to clarify, as i got many comments offline asking about the context of the title)

Saturday, August 29, 2009

మనం

మనసులు వేరైనా ప్రేమ ఒక్కటె...
ఆశలు వేరైనా జీవితం ఒక్కటె...
క్షణాలు వేరైనా జ్ఞాపకం ఒక్కటె...
కలలు, కన్నీళ్ళు వేరైనా ఓదార్పు ఒక్కటె...
నువ్వు నేను వేరైనా "మనం" ఒక్కటె...

Thursday, August 27, 2009

naatho nenu

Eppudo raasukunna lines --- (may be in year 2001)

samasya anni vypula nundi, nannu kammesthondani anipinchinappudu, encheyyalo, encheyyakoodado theliyanappudu, okka saari nenu kallu moosukuntaanu naaloni nannu vethukkuntoo.. . aalochisthaanu, nannu daati, aa bhagavanthuni gurinchi, aanandam gurinchi, prema gurinchi, jeevitham gurinchi.. , nenu ane bhaavana vidichi prapanchaanni choosthaanu, etu choosina annee naakosame anipisthundi, nenenduku puttaanu, nenemsaadhinchagalanu, ani aalochinchukuntaanu, "repu" naaku svaagatham cheputhunnattu anipisthundi, aa svaagathaaniki naa kanneellu veliki vachchi "nedu" ni thadipesthaayi, aa aardratha nannu puneetham chesthundi, aa anubhoothi kshaname vundachchu, kaani aa kshanam nijam. enno anubhavaalu ivvaleni aa aanandam nannu aakraminchukuntundi, samasyanu edurkuntaanu, rettimpayina nammakam tho, nischayamgaa, malli mundukelathaanu, . ninnanu nenedurkunna samasyalathonu, neduni nenu panchipettina aanandaalathonu, repuni nannu nadipisthunna aashayaalathonu lekkapedathaanu. nenu daati vachchina malupulanu choosthe naaku koncham garvam gaane vuntundi, aa malupulu eppudu naa kanneella kallaapulatho, chirunavvula rangavallulatho ninna nu guruthu chesthuntaayi, repu vypu nannu nadipisthuntaayi,...

Wednesday, August 26, 2009

ramadasu malli puttadu ?

raamadasu malli puttadu.nijam gane, ninna naaku kalalo aa bhagavanthudu kanipinchi, ee vishayanni druveekarinchadu. andarikee cheppamannadu. poorvaparaalaki vasthe, mr.devudu entannadante, raamadaasu kante bhagavathathvanni, advaitha siddaanthanni akalimpu chesukunna vyakthi mana madhyane vunnaranta. monneppudo paper lo choosi nenoo anukunnanu, kaani antha lothu ga aalochinchaledu. ninna rathri aa paivade vachchi cheppaka kooda manam artham chesukokapothe ela.
ee madhye, tirupathi lo oka raamadasu, swami vari nagalanu thakattu petti thana sontha kharchulaku vadukunnadanta. intha kante rujuvemkavali ithane poorva janmalo raamadasani. e rakam ga choosina ee vishayam lo naaku vintha emee kanipinchaledu. bhagavanthudoo bhakthudoo veru kaadani advaitham cheppane cheppindi, mari alaantappudu, mana raamadasu 2009 thana alankaaraanne thyajinchinattu kada, paramathmatho entha ekamaithe thappa ilaanti aalochanalu vasthayi manishiki. maree avasaram aithe viluvalu thakattu pettali kaani, aa paivaadi bangaranne thaakattu pettadante, ee allochane chala vinoothnam ga vundi. Paatha raamadasu thana kharchu tho nagalu cheyinchadu, ee ramadasu nagalanu thana kharchuku vaadukunnadu. peddaga theda emundi ?
edi emaina, raghavendra rao garu inko movie theeyalsinde, nagarjune chesthe baavuntundani naa abhiprayam. inka story line loki vasthe, raamadasu malli puttalsina avasaram entante,... naaku mathram enthelusu.. adantha mana chinni krishna/bharavi choosukuntarulendi. ramgopal varama ki ivvachchu kaani, maree ramadasu raamuni meeda revenge theerchukunnattu choopisthe baagodemo ani naa feeling.

entha nannu nenu samadhana parachukunna naaku ee prasnalaki samadhanam dorakadam ledu.
1. idi vyavastha lo lopama. manishi pathananiki udaharana. 2. vigrahaale vaddanna advaitham,chivaraku alankara la venaka enduku padindi. 3. bhakthi margam lo nadavadaniki vigraham avasarama, aalayam.. hangulu avasarama. ? 4. bhagavanthunni alankarinchalsindi svachchamaina manassutho kada, mari bangaru nagalu enduku vigrahaaniki. 5. bhagavanthudu, thana nagalanu enduku rakshinchukoleka pothunnadu. inka manalni elaa rakshishtadu.. :-(
edi emaina, idi oka manchi story e, doubt e ledu. nannu enduku aa devudu involve chesaado kaani.
chivaraga okka aalochana, nijamaina bhakthiki bhagavanthudu vundalantara ?

Tuesday, August 25, 2009

జ్ఞాపకాలు

క్షణాల తీరాన అలసి నిలబడిపొతాను,....
జ్ఞాపకాలు కెరటాల్లా వచ్చి నన్ను తాకకుండానే వెనక్కి వెళ్ళిపొతాయి,....
నేను లెక్కపెట్టుకుంటూ వుంటాను....
నేడు కూడా జ్ఞాపకమై నన్ను వదిలి వెళ్ళిపొతుంది,....
నేను లెక్కపెట్టుకుంటూ వుంటాను,....

Monday, August 24, 2009

కల్పన

వినాయక చవితి కదా, అని temple కి బయలుదేరాం. India లో వినాయక చవితిని ఎంత sincere గా చేసేవాణ్ణో గాని, ఎందుకో ఇక్కడ sudden గా నాలో కొంచం భక్తి పాలు ఎక్కువ అయ్యింధి. :-) పారిస్ లో వినాయకుని temple. కొంచం కస్టమే వెతకడం, మా friend tamil influence తో మొత్తానికి temple కి చేరుకున్నాం. పూజా ప్రసాదాల అనంతరం, దగ్గరలో ఉన్న ఒక Indian restaurant కి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ కనిపించింది నాకు కల్పన, వయసు సుమారుగా 7-8 వుంటుందేమో. చక్కనైన తెలుగుదనం వుట్టిపడుతూ వుంది. చూసిన వెంటనే అనుకున్నా, మాటా మాటా కలిపాక ఇక్కడి కి ఉద్యోగ రీత్యా వచ్చిన తెలుగు కుటుంబం అని అర్థం అయ్యింది.

ఏదో వింత ఆకర్షణ, శక్తి ఉన్నాయి ఆ అమ్మాయిలో, నిర్మల మైన ముఖం, కట్టి పడేసే చిరునవ్వు. పేరు కు తగ్గట్టే, ఎదో తెలియని లోతు వుంది ఆ కళ్ళల్లో. "కల్పన" మంచి పేరు అనిపించింది. ఈ మధ్య కాలం లో ఆ మాత్రం అర్ఠం ఉన్న పేరు వినడం ఇదే ప్రధమం. నీ పేరు కి అర్థం తెలుసా, అని అడిగాను నేను నా పాండిత్యం ఎదో కొంచం చూపిద్దామని. కల్పన అంటే, మీ ఊహ uncle అంది. (ఈ మధ్య అందరూ నన్ను uncle అనే పిలుస్తున్నారు. అన్యాయంగా.. ). ఊహ.. అమ్మో ఈ అమ్మాయికి తెలుగు బానే వచ్చు అనుకున్నా. ఊహ అంటే, అని అడిగా.. ఎదో మాటల్లో పెడదామని. మీ ఊహ అంటే మీరే అంది. ఈ సమాధానం చాలు నా నోరు మూయించడానికి, ఇంకా ఎందుకులే మన అజ్ఞానం చూపించడం అని వచ్చిన food మీద concentrate చెయ్యడం మొదలు పెట్టాను. కానీ మన బుర్ర వూరుకుంటుందా.. "ఊహ అంటే నేనే... " .. ఈ వాక్యం లో చాలా విషయమే ఉంది అనుకున్నా, నిజమే కదా.. నా ఊహ అంటె నేనే కదా. కానీ ఎలా ? మనిషికి తెలియంది ఊహించే శక్తి ని ఆ పై వాడు ఇచ్చాడు. కానీ నిజం గా మనకి తెలియని విషయాన్ని ఎలా ఊహిస్తాం... అది సాధ్యమేనా ? ఊహ అంటే ఏమిటి ? నాకు అనిపిస్తుంది.. ఊహ అంటే మన గతం అనే రంగు కళ్ళ జోడులోంచి మనకి తెలియని భవిష్యత్తుని చూసుకోవడం. అందుకే మన ఊహలెప్పుడూ మన గతానికి, ఆలోచనలకి, వ్యక్తిత్వానికి దగ్గరలో ఉంటాయి. నిజం గానే నన్ను దాటి, నేను ఆలోచించగలనా ? అది సాధ్యమా ?

మన భయాలు.. ఆందోళనలు.. దాని వల్ల వచ్చే దిగులు.. అంతా మన కల్పనే కదా. మనిషి తాను ఎదుర్కుంటున్న కష్టాల కన్నా, ఎదుర్కోవలసి వస్తుందేమో అని అనుకునే కష్టాల వలనే ఎక్కువ వేదన పడతాడు. ఎప్పుడో ఒక పుస్తకం చదివాను, పేరు "The Present", చదివిన కొన్ని రోజుల వరకు (infact, వారాల వరకు), నా ఆలోచనలని వదలని పుస్తకం అది. పుస్తకసారాంశం ఏంటంటే - "learn from the past, plan the future, live in present. Do all this with a purpose". ఎంత నిజం .... నాకైతే భగవద్గీత లా అనిపించింది. ముందూ.. వెనుకా... ఈ ఆలోచన లేకుండా ఇప్పుడు జరుగుతున్న క్షణం ని బ్రతికెయ్యడం.. ఎంత సులువు ? ఎక్కడో చదివాను నేను, తల దువ్వుకుంటున్నప్పుడు జుత్తు గురించే ఆలోచించాలని.. కరక్టే అనిపించింది. గతం గురించి ఆలోచించి... భవిష్యత్తు గురించి కలవర పడి... మనం మన వర్తమానం అంతా వృధా చేసుకుంటాం.. అప్పుడప్పుడు. (may be ఎల్లప్పుడూ.. ) Less luggage more comfort అన్నట్టు, మరీ గతమంతా భుజాన్నే ఉంటే, ముందుకెలా అడుగెయ్యడం.

ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకుంటా.. OK.. మళ్ళీ కల్పన దగ్గరకు వచ్చేస్తా. నేను తినడం start చేసాక, వాళ్ళూ order చేస్తున్నారు. వింత ఎమిటంటే, వాళ్ళ mummy కి కూడా కల్పనే order చేసింది. ఆవిడ menu కూడ చూడలేదు. ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ అలా చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళిన వెంటనే, కల్పనని అడిగాను, అదేంటి నువ్వే order చేసావ్ మీ mummy కి కూడా.. అని.... నాకు తెలుసు uncle మా mummy కి ఎంకావాలో... అంది.... అక్కడితో ఊరుకుందా ... మీకు తెలీదా మీ mummy కి ఏంకావాలో అని అడిగింది.. అంతే,... ఆ ప్రశ్న ఇంకా నా చెవిలో కూర్చుని.. నన్ను కలవర పెడుతూనే వుంది..---

(Thanks to my better half for typing all this text in telugu.)

Sunday, August 23, 2009

The best poem i have ever read

Would that I had wings to fly to you...
Expecting nothing more than the gift of seeing you go about your day,
carrying out your ordinary routine, while I remain unseen....
watching over you,as would an angel of tender compassion.
When night falls, still I would remain, and across your lips,
place the hint of a featherlight kiss to erase your worries....
replacing them with undisturbed peace.

Wishing that somewhere in the realm of dreams and imagination,
you might find a place where both spirit and the physical are allowed to meet,
if only once in a lifetime.... Where you could simply hold me...
and I, of course, would feel it.

nedu

"repu gurinchi bhayapadaku,...
adi nuvvu kaastha reppa moosi therichesariki elaano vachchesthundi,....
edurkoka thappadu ,...
ninna gurinchi baadhapadaku,....
adi eppudo vellipoyindi,...
daaniki nuvvu samaadhaanam cheppakkarledu,...
adee neeku samaadhaanam cheppadu,...
nee chethilo vunnadi ,.... nedu,.....
daanini haayigaa aanandam gaa anubhavinchu,....
repu meeda aasakthi peruguthundi,...
nee meeda neeku nammakam peruguthundi,....
Ninna oka paatham... gurthu pettuko..
nedu oka margam upayoginchuko..
repu oka gamyam... cheruko.. "

ఏమని నిర్వచించను

తిరిగిరాని గతాన్ని నేనయితే, మరపు రాని జ్ఞాపకానివి నీవు,
భావమెరుగని మాటను నేనయితే, భాషకందని మౌనానివి నీవు,

నేత్రాలు నావే, - చూపు నీది,
హౄదయం నాదే, - స్పందన నీవు,

వత్తినై మండిపొతూ, సంబరపడిపొతాను,- ఆత్మ త్యాగమనీ,...
నన్ను నిల్పిన ఆ నూనెవు నీవు, వెదజల్లుతున్న ఆ వెలుగువి నీవు,

జ్ఞానానికి ౠజువులడుగుతాను, తెలీకే,..
కన్నీళ్ళ కావ్యాలు చదివించి, కాస్తా నూరిపోస్తావు,
మళ్ళీ మరువకుండా,....

కొంచం తెలిసి వస్తే చాలు,
"అదిగో నీవు ఇక్కడ.. ",- అంటాను,..నీటి చుక్కలో నింగిని వెతికినట్టు,....
నన్ను చిన్నబుచ్చక, ఆ నింగినే నా కనురెప్పల మధ్య బంధిస్తావు,
విశ్వమంతా ఇమిడి ఉన్నా, నా కాస్త హౄదయంలోనూ కొలువు తీరావు,...
నన్ను నడిపిస్తున్నావు, నడక నేర్పిస్తున్నావు,...........

నిన్ను ఏమని నిర్వచించను ప్రభూ, ఏమని నిర్వచించను,.....
ఆకాంక్ష నేనయితే, ఆనందానివి నీవు,
ఆలోచన నేనయితే, అనుభూతివి నీవు,
నిన్న - రేపు ల లెక్కకు అందని అనుభవానివి నీవు,
అమృతత్త్వానికి నేనిచ్చుకున్న ఆకృతివి నీవు,..

( కౌముది reference - http://koumudi.net/Monthly/2009/february/index.html )

Koncham coke.. Koncham kanneellu.

koncham coke koncham kannellu..
paris lo rojulu vegam gaane nadusthunnai.. edo kaagithalni padu chese alavaatu vundi kada ani.. thochindi raasukundamani modalu pettanu.. idi dairy kaadu. alaa ni katha kaadu.. nenu choosinavi.. nenu thelusukunnavi naatho nenu chepppukovalani anthe..
monna oka roju, saayanthrame bayaluderam chakkerlu kottadaaniki.. edo oka tourist attaction choosam anipinchukuni thirigi hotel ki bayaluderam. enduko naaku ee pradesalakanna.. manusule aasakthi ni kaligistharu. entha abhivriddi chendina nagaramaina.. manushulu manasulni jayincheru kada anipisthundi naaku.
nijame.. manadi kaadu anukunna nagaram, aahladanni isthundi kaani.. aanandanni ivvadu. chaduvukunna school, aataladukunna park, ammatho tea thaagina beach road goda, ivi choosthe vachche aanandam.. eiffle tower ni choosthe vasthunda ? emo adi naaku prasne.. manishi oka samskruthiki, alavaatlakee entha attach aipothodo anndadi vaatiki dooram ga vachchinappudu spashtam ga thelustundi.
inthakee chepthoo aagipoyaanu, hotel ki thirigi bayaladerina memu, baaga late avvadam valana, oka suburben (paris nunchi migatha pranthalaki velle train) ekki koorchunnam. prayaanam entho sepu vundadu, ayina nenu alavaatuga atoo itoo choosthunna. ikkada train kooda entha mounam ga velli pothundante.. nenu naa jnapakalaaki nisshambhdam ani chepthoo vuntanu.. :-)
ee prayanam lo nenu oka vyakthini choodadam modalu pettanu, vayasu aravai pai padi vuntundemo, ekkado mundu station lone ekkinattunnadu (chanuvu tho annanu). cheithlo oka coke tin, maroka chethilo edo pusthakam. ikkada adi sarva sadharam kaabolu. maatalleni prayanaalu.. naaku vintha gaane vundi. nenu choosthunnanani athaniki thelise avakaasam ledu, madhyalo vunna seats nannu cover chesthunnai. train modalaindi.. eppatilaage vegam ga.. nishsabdham ga.. inthalo sudden ga ee vyakthi edvadam modalu pettadu.. naaku okka kshanam nenu choosthunnadi nijamena anipinchindi. okatiki rendu saarlu choosaka.. nirdharinchukunnnanu. madhya madhyalo coke thaguthunnadu.. mallee vekki vekku edusthunnadu. naa aalochanalu train kante vegam ga parigeduthunnai.. encheyyalagalana ani aalochinchanu.mana prantham kaadu. mana bhasha kaadu.. encheyyalganu.. ala aalochisthoo choostoo vundi poyaanu..
enduku kanneelu.. naaku eppudoo kanneellu aashcharyanne kaligiesthayi. aanandaniki chirunavvu laga.. badhaki kanneelu.. kaani kanneelu raani badhalu marenno. en kashtamochchindi ihanikeea ani naa badha ippudu. aa vayasu lo oka manishi badhapettedi bayata vallu mathram kaadu. khachchitham ga. vruddapyam lo manishini kalavara pettedi.. kanneellu pettinchedi kutumbame. ikkada paris lo asalu kutumbalu vuntaya.. ithanini pillalu vodilesara ? leka evarinaina pogottukuni badhapaduthunnada .. enno prasnalu.. velli adagalenu..
okkosaari anipisthundi naaku.. manishiki oka vayasu tharuvtha badhalu vundavu ani ante entha baavuntundi ani. appudu nijam ga jeevithaniki oka andam. aa devudiki ee idea enduku raaledo. alaa naa aalochanalu aagakunda pothunnannai. jeevithaniki artham ivvadam lo vunda.. theesukovadam lo vunda.. kolpovadaniki siddapade theesukovalannadi naa abhipraayam endukante chivaraku edeee migaladu kada.. nenu ane aham tho saha..
cheekati theralanu cheelchukuntoo prayanam konasaaguthondi.. kaani athani vedaniki anthamekkada.. maha samudralu enni daatini.. manishi hrudaya samudraniki kannnella keratale kada odaarpu. nijam gane. vedanaki kanneere goppa odaarpu, naaku anipisthundi prathee kanneetibottuni daachukovalani. adi cheppina nijam padila paruchukovalani.
nalabhyallo vunna dhairyam nammakam manishiki aravaillo vundadu. may be sareeram valla kavacchu.. manasu valla kavachchu. nerhcukunnadi paatinchadaniki okka jeevitham saripotunda anipisthundi naaku. samskruthi edaina, aanandam tho paatu vedanaa thappadu kada. manam anukunnattu mana jeevitham vundakapothe vedana padadatham. anduke adee mana ahamkaarame anipisthundi naaku. idi nijamena.. thananu thaanu jayinchina vyakthi ki vedane vundada ?
inthakee mana kathalo hero lo e maarpoo ledu.. enduko naaku sudden ga bhayam vesindi, ee badhalo e aghayathyaniko palpadadu kada ani. nijam gaane manishi chaavadanikena siddapadathadu gaani. konni nijaaalu oppukoledu enduko. jeevitham lo assalu oppukolindi.. nenu evarikee akkaraledu annadi.. nijaaaniki mokshaniki adi motadi mettu anukuntanu nenu. kaani entha bhayamkaramaindadi aa mettu.
kaasepatlo next sation vachchestundi.. naa aalochanalu inkaa parigeduthoone vunnai. mana samjaalam lo abbai ammayi ani praakulaadatham, thalli thandrulu vaalla jeevithamle arpistharu. pillala bavishyaththu kosam. ikkada samajam lo elaa vuntundo ani anukunnanu, kaaneee pillala meeda mamakaram lo peddaga theda emee vundadu kada. thalli manasuki.. thandri badhyathaki.. e samajam aithe nemi.. paridhulu levu kada. jeevitha chakram parugu lo vathyasamuntunda.. annee kaavalanukune vayasununchi.. manalni evaro okaru kaavali anukovali ane vayasu varakoo.. ee chakram thirugoothoone vuntundi. correct ga oka pedda giant wheel laga.. entha eththuku edigina mallee nelani thaakaalsinde chivaraku.
ee aalochanallo padi.. nenu marche poyaanu.. inthalo next station vachchindi. mana kathalo hero aa kanneella thone digipoyaadu.. nenu choosthoone vunna.. peddaga nittoorchanu.. athanni oka yuva janta gattiga hug chesukovadam choosi.
appudu gurthochchindi.. kanneellu.. konni kolpoyinappudoo vasthayi.. eppatinuncho korukunnadi dorikanappudoo vasthayi..
edmaina... kanneellu.. coke manchi combination kada.. :-)

naa harivillu

Aanandaalu, kanneellu, anukoni malupulu, aadarinche majileeloo.. .... jeevitham maree vegam ga velliphunte, naatho nenu matladukovadaniki, nannu nenu gurthuku thechchukovadikee.. naa harivillu.