Sunday, December 13, 2009

ఒంటరి గది

ఒంటరి గది...
గాలిని ఒంటరితనం ఆక్రమించుకున్న ఆ గదిలో, నిశ్శబ్ధం మాట్లాడుతుంది. అందుకని అలిగి మాట గొంతు మూగబోతుంది. గతాన్నే తలుచుకుని జ్ఞాపకం కంటనీరు పెట్టుకుంటుంది. 'నేను' అనే అస్థిత్వం నిట్టూరుస్తుంది. కాలం పడిలేస్తూ వెళ్ళిపోతుంది. జీవితం మాత్రం ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోతుంది. కిటికీ రెక్కల సందుల్లోంచి జారుకుని నా ఆలోచన ప్రపంచాన్ని చుట్టి వెనక్కి వస్తుంది నాకు ఎన్నో చెప్పాలని, నన్ను చూసినంతనే సర్వం మర్చిపోతుంది. నన్ను ఒంటరిగానే మిగిల్చేస్తుంది.. అయినా నా ఒంటరితనం నాతోనే వున్నప్పుడు నేను ఒంటరిని ఎలా అవుతాను ?
(పాత డైరీ లో కనిపించి పలకరించాయి, నేను ఎప్పుడో రాసుకున్న ఈ లైన్లు)

1 comment:

  1. " కాలం పడిలేస్తూ వెళ్ళిపోతుంది. జీవితం మాత్రం ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోతుంది " Beautiful!

    ReplyDelete