Friday, January 1, 2010

నువ్వు-నేను

వెలుగు చీకట్లు మనిషిలోనూ దోబూచులాడుతుంటాయి. చిరునవ్వులైనా, కన్నీళ్ళైనా అది మనలోపలనుంచి రావాల్సిందే. మరి అలాంటప్పుడు మన ఆనందం ఎప్పుడూ మన ఆధీనంలోనే ఉండాలి కదా ? అందుకే నాకనిపిస్తుంది, ప్రతీ మనిషిలోనూ కనీసం రెండు వ్యక్తిత్వాలు అనుక్షణం పోటీ పడుతుంటాయేమో..అని. ఏది చివరకి విజయం సాధిస్తే, అది మన ప్రవర్తన గా బయటకు కనిపిస్తుంది, ఆ క్షణానికి. అందుకే నేను గట్టిగా నమ్ముతాను, గెలుపైనా, ఓటమైనా.. అది నాతోనే.. నాలోనే. ..
ఇలాంటి ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఒక కవిత ( కవిత లాంటిది :-) ) రాసి ఆ మధ్య ఎప్పుడో కిరణ్ ప్రభ గారికి కి పంపించాను, అది ఈ రోజు కౌముది లో దర్శనమిచ్చింది. వీలున్నప్పుడు తప్పక చూడండి.
(కౌముది లింక్: http://www.koumudi.net/Monthly/2010/january/index.html )

1 comment:

  1. నమస్కారములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు+సంక్రాంతి .మీ కవిత " కౌముది " లో " నువ్వు-నేను " చదివాను. చాలా బాగుంది.సరిగ్గా అలాంటి కవితే నాదగ్గర ఉంది. అది పంపా లనుకుంటూనే పంపలేదు. నా ఆర్టికల్స్ " ఆంధ్ర ఫొక్స్ " లొ ఉన్నాయి వారు ఒక్క రోజులొ ప్రింటు చేస్తారు.అందుకె వారికి ఇస్తాను.

    ReplyDelete