Wednesday, May 19, 2010

మౌనం .. నీదీ.. నాదీ

ఈ రోజు నాకు తారస పడిన ఈ రెండు లైన్లు కి ముచ్చట పడి.. నా మాటల్లో రాసుకున్నాను..


I plucked a silence from you
I plucked a silence from me
And entwined it into a conversation of sorts..



నీ నుంచి ఒక మౌనాన్ని కోసుకున్నాను.
నాలోని మౌనాన్నీ వెతికి పట్టుకున్నాను..
ఆ రెంటినీ కలిపి నాలోనే అల్లుకున్నానా!!..
అదో మధుర భాష్యం అయ్యింది..

నీ నుంచి ఒక్క క్షణం అడిగే తీసుకున్నాను.
నా లోనీ ఆ క్షణాన్ని కోరి ఏరుకున్నాను..
ఆ రెంటినీ కలిపి నాలోలోనే కరిగించుకున్నానా!!
అది నా జీవితం అయ్యింది...

6 comments:

  1. చాలా బాగుంది.
    ఒక క్షణం మానుంచి తీసుకున్నారు
    ఒక క్షణం మీ కలం తో దానికి రంగులద్దారు
    ఆ రెండు కలిపి ఒక మంచి కవితై మనసున నిలిచింది..

    ReplyDelete
  2. చాలా బాగుంది :-)

    ReplyDelete
  3. అద్భుతమైన భావం

    ReplyDelete