చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని నేను..
అంధకారాన్ని బంధించాననుకుంటాను.
జ్ఞాపకాల కెరటాల మధ్య ఊగిసలాడుతూ..
కాలాన్ని ఆపేసానని మురిసిపోతాను.
నిన్ను పొందాలనే తాపత్రయం లో నన్ను నేను పోగొట్టుకున్నాను..
"నేను" లేను అని తెలుసుకుని.. నువ్వూ వదిలి వెళ్ళిపోయావు..
ఎవరూ వద్దని అనుకుంటే.. అది ఏకాంతం..
ఎవరూ లేకపోతే.. అది ఒంటరితనం..
కానీ నాలో నేనే లేకపోతే.. దాన్నేమంటారు ..
జీవితం ?
నేను ఓటమిని ఒప్పుకోలేదులే..
నన్ను నేను వెతుక్కుంటూ బయలుదేరాను..
నాకు తెలుసు... నువ్వూ నన్ను పోగొట్టుకోవని...
నాకు తెలుసు..
నువ్వు అనంతానివేమో.. కాని నేను లేకుండా..
నువ్వు అసంపూర్ణానివే..
నాకు తెలుసు.
చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని నేను..
ReplyDeleteఅంధకారాన్ని బంధించాననుకుంటాను.
జ్ఞాపకాల కెరటాల మధ్య ఊగిసలాడుతూ..
కాలాన్ని ఆపేసానని మురిసిపోతాను
ఎంత భావుకత!...చాలా చక్కగా ఉంది మీ కవిత :-)
చాలా బావుందండీ మీ కవిత.
ReplyDeleteచాల బావుంది మీ కవిత ....నేను మీ blog చదువుతుంటాను బావుంటాయీ rare combination of analysis and భావుకత.....raghavi
ReplyDelete