Tuesday, August 3, 2010

ఇంకో నాలుగు అడుగులు .. నాతో..




ఇంకో నాలుగు అడుగులు నువ్వు నాతో వేసి వుంటే,
ఆ గమ్యమేదో నాకూ కనిపించేదేమో..
ఇంకో నాలుగు మాటలు నువ్వు నాతోనే చెప్పి వుంటే,
నీకు అర్థమయ్యేలా నేనూ చెప్పగలిగే వాణ్ణేమో..

ఇంకో నాలుగు కలలు నాతో పంచుకుని వుంటే..
అవి నిజమే అని ఒప్పించగలిగే వాళ్ళమేమో..
ఇంకో నాలుగు క్షణాలు.. నువ్వు నాతోనే ఉండి వుంటే..
నేను మళ్లీ పుట్టే వాణ్ణేమో... కేవలం నీకోసం..

ఆ కెరటాల వెనుక దాగున్న ఆకాశాన్ని...
ఆ చీకట్ల వెనుక వేచి ఉన్న సూర్యోదయాన్ని..
ప్రతీ మలుపు చివరా సేదతీర్చే పూలతోటని..
ఆగక మనల్ని నడిపించే బ్రతుకు బాటనీ..
కలిసే చూడ గలిగే వాళ్ళమేమో.. మనం.

వెనక్కి తిరిగి చూసుకుంటే.. గెలుపే నన్ను వెక్కిరిస్తుంది..
నువ్వు లేని ఏ విజయం ఆనందాన్ని ఇస్తుంది.. ?
నువ్వు లేని ఆనందం.. అసలు ఆనందం ఎలా అవుతుంది.. ?



( ఇప్పుడు పెద్దగా కాంటాక్ట్ లేని ఒకరిద్దరు నేస్తాలు ఎందుకో బాగా గుర్తొచ్చారు. బహుశా ఫ్రెండ్ షిప్ డే హేంగోవర్ కావొచ్చు.. ఆ మూడ్ లో ఓ నాలుగు లైన్లు రాసుకున్నాను. నిజంగానే ఒక్కోసారి ఆశ్చర్యం గా వుంటుంది నాకు, ఒకప్పుడు జీవితం అనుకున్న కొన్ని బంధాలు మళ్లీ పెనవేసుకోలేనంత దూరం అయినా.. జీవితం సాగుతూనే వుంటుంది.. మంచో చెడో.. కాలం కదులుతూనే వుంటుంది. మళ్లీ ఎప్పుడో అప్పుడు కలవక పోతారా అనే ఆశ కూడా హృదయం లో ఎక్కడో సజీవం గానే వుంటుంది )

2 comments:

  1. ఆ కెరటాల వెనుక దాగున్న ఆకాశాన్ని...
    ఆ చీకట్ల వెనుక వేచి ఉన్న సూర్యోదయాన్ని..
    ప్రతీ మలుపు చివరా సేదతీర్చే పూలతోటని..
    ఆగక మనల్ని నడిపించే బ్రతుకు బాటనీ..
    కలిసే చూడ గలిగే వాళ్ళమేమో.. మనం. ee words chala bagunnai.avunu jeevitham saguthune untundi kalam kaduluthune untundi ...baram ga.. , vedanaga....

    ReplyDelete
  2. ఇప్పుడు కలిసినా దగ్గర కానివ్వని దూరాలు వెంటాడుతూనె ఉంటాయి.ఆ బాధ కంటె దూరంగానె ఉన్నా మధుర శ్మృతులను మననం చేసుకుంటు మనసుకి దగ్గగా బ్రతకటం మానసిక ఆనందం.అవునా ? మీ కవితలు మనసును కదిలిస్తున్నయి.

    ReplyDelete