Saturday, August 7, 2010

ఓదార్పు..


అలసిన ఆలోచనకి చిగురించే ఆశ ఓదార్పు..
మరల రాని గతానికి గుర్తొచ్చే జ్ఞాపకం ఓదార్పు..
చీకట్లో కరిగిన ఆ నిన్నకి ఉదయించే నేడు ఓదార్పు..

అంతులేని వేదనకి.. ఉబికి వచ్చే కన్నీరే ఓదార్పు..
రాలే ఆ కన్నీటిబొట్లకి తుడిచే నీ చేయే ఓదార్పు..
వెంటాడే ఒంటరితనానికి నీ ఉనికే ఓదార్పు..

సాగిపోయే జీవితానికి.. తోడొచ్చే కాలమే కదా ఓదార్పు!!

6 comments:

  1. "మరల రాని గతానికి గుర్తొచ్చే జ్ఞాపకం ఓదార్పు.."
    "వెంటాడే ఒంటరితనానికి నీ ఉనికే ఓదార్పు.."
    చాలా బాగుంది.

    ReplyDelete
  2. మీ కవిత నా మనసుకి మంచి ఓదార్పు...బాగారాసారు!

    ReplyDelete
  3. మీ కవితలో ప్రతి వాక్యము
    మధుర భావాల సమ్మేళనము
    ఆ కవితకు ప్రాణం పోసే చిత్రము
    వెరసి మీ కవిత్వం అద్భుతము

    ReplyDelete
  4. kavitha chala bagundi,kani chikatilo karigina ninna kuda mana gatham lone unnapudu gurthu vachhe jnapakam( chikati jnapakam) oka odarpuga kakunda udayinche neduki addanki ga untundemo.

    ReplyDelete