Saturday, August 14, 2010

స్వాతంత్ర్యం..


స్వాతంత్ర్యం..
బానిసత్వం నుంచి వచ్చింది స్వాతంత్ర్యం,..
కానీ పేదరికం నుంచి ఎప్పుడు ?
పరాయి అజిమాయిషీ నుంచి వచ్చింది..
మతతత్వం నుంచి ?
దగాకోరు పాలన నుంచి వచ్చింది..
అవినీతి నుంచి ఎప్పుడు ?

ప్రజాస్వామ్యం ఐతే ప్రతిష్టించాం..
ప్రజల హృదయాల్లోకి ఎప్పుడు ?
గెలిచే నాయకులకి ఏ కోరతా లేదు..
కానీ ప్రజల్ని గెలిపించేదెవరు ?

హక్కులన్నీ సాధించుకున్నాం..
మరి బాధ్యతల మాట ?
ప్రశ్నలు అన్నీ బానే అడుగుతాం..
కానీ అక్కడితో సరా మన పాత్ర ?
భారతీయులం అని గర్వ పడతాం..
ఆ గొప్ప తనంలో ఎప్పుడు మరి మన భూమిక ?

ఎగురుతున్న జెండా చూసినప్పుడు ఆ స్వేచ్చ కోసం జీవితాలు అర్పించిన యోధులందరికి మనసులోనే శిరస్సు వంచి నమస్సుమాంజలి తెల్పుకుంటాను. కానీ పరిణితి చెందిన సమాజానికి ఆ స్వాతంత్ర్యం ఒక బాధ్యత అని కూడా గుర్తుకు తెచ్చుకుంటాను.

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

3 comments:

  1. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  3. మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    - శిరాకదంబం

    ReplyDelete