Sunday, September 12, 2010

గదిలో ఆకాశం..


గదిలో ఆకాశం.
నాకంటూ ఓ ఆకాశం.. నా గదిలో.
నా చిరునవ్వులకి వెన్నెల కురిపిస్తుంది.
వేదనికి కన్నీటిని వర్షిస్తుంది.. నా కళ్ళల్లోంచి.
గదిలో ఆకాశం.
నా ఆశల్ని, తాను హరివిల్లై అలంకరిస్తుంది.
కాస్త నిస్తేజానికి తానూ చీకటై వంత కలుపుతుంది.
విజయాలకు మెరుపు తోరణాలు కడుతుంది..
ఓటములకు కారుమబ్బులూ..
గదిలో ఆకాశం.
నా ఆలోచనలకు నీడనిస్తుంది.. వాటికో రూపమివ్వాలని దాని ఆరాటం.
అన్నీ ఉండీ, నేను ఒంటరైన క్షణం, నాకు తోడు తానే అవుతుంది.
గదిలో ఆకాశం.
రేయి చీకట్లో, నిన్నని దాచేస్తుంది. ఉహల్లోని రేపుని కలగా చూపిస్తుంది.
కన్ను తెరిచి చూస్తే మాత్రం, నిజాన్ని తప్పక చూడనిస్తుంది.
గదిలో ఆకాశం..
అన్నింటికంటే ముఖ్యం గా...
నన్ను నాకు గుర్తుచేస్తూనే వుంటుంది..
మరచిపోయినప్పుడు.
నా గదిలో ఆకాశం..

అలా తిరగని ఫ్యాన్ వైపే చూస్తారెందుకండీ ?
ఏముంది అక్కడ ? మా ఆవిడ కోప్పడుతూనే వుంది..
నా గదిలో.. నా ఆకాశం. నా మనస్సుకి వెలుపలి ప్రతిబింబం.

1 comment:

  1. భాస్కర్ గారూ.. చాలా చాలా బాగుంది మీ గదిలో ఆకాశం..:) మీ ఆలోచనలు అనుభవాలు అభిరుచులు అన్నీ పంచుకునే మీ ఆకాశం నాకు చాలా చాలా నచ్చింది.

    ReplyDelete