Tuesday, October 12, 2010

ఈనాడు ఆదివారం పిల్లల కార్టూన్ :-)



మొన్నటి ఈనాడు ఆదివారం అనుబంధం లో వచ్చిన ఈ పిల్లల కార్టూన్ నాకు భలే నచ్చింది. కార్టూన్ అసలు అర్థం నవ్వుకోడానికే, అయినా ఎందుకో దాంట్లో ఓ మంచి ఆలోచన నాకు కనిపించింది.

నిజమే నేను పోటీ పడాల్సింది నాతోనే కదా. ఆ కార్టూన్ లోని వాక్యాన్నే ఇంకోలా రాసుకున్నాను..
"ఎవరైనా గెలవాల్సింది వాళ్ళ మీదే కదా !!"

నా నేడుని నిన్న కంటే మెరుగ్గా ఉంచుకుంటాను..
వచ్చే ఆ రేపు ఇంకా మెరుగ్గా వుండాలని ఆశ పడతాను.
అనుక్షణం నేను పోటీ పడుతూ వుంటాను, నాతోనే.
గెలుస్తూ వుంటాను, ఓడిపోతుంటాను.. నాలోనే.


కాలపు రెక్కలు అలసినప్పుడల్లా, జీవితం, ఒక్క క్షణం ఆగి, నా వైపు చూస్తుంది. నన్ను నేను ఆవిష్కరించుకుంటాను. సరికొత్తగా.
ప్రతీ చిన్న మజిలీకీ అదో పేరు పెట్టుకుని మురిసిపోతుంది, నేను మాత్రం మళ్లీ మొదలౌతాను. సరికొత్తగా. .

2 comments:

  1. బాగానే ఉంది కాని కొంతకాలానికి నూతిలో కప్పలమయ్యే అవకాశం ఉందండీ. దీనికన్నా పోలికతోకూడిన ఆరోగ్యకరమైన పోటీ త్వరితగతినిపురోగమించడానికి తోడ్పడుతుందని నా అభిప్రాయం.

    ReplyDelete
  2. మీరు చెప్పిందీ కరెక్టే అండి. మనం ఇతరులతో పడినప్పుడు కూడా, గెలుపు ఓటములు మన బలహీనతలు, లోపాలతోనే అని అర్థం చేసుకోగల్గితే పోలికని నివారించగలమేమో. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete