Wednesday, October 27, 2010

జేజమ్మ మళ్లీ పుట్టింది.. కాశ్మీర్ కోసం.

అరుంధతమ్మ (జేజమ్మ) మళ్లీ పుట్టింది, కాశ్మీర్ కష్టాలన్నీ తీర్చడానికి. చరిత్ర అంతా ఓ లుక్ వేసి, అసలు కాశ్మీర్ ఇండియా లో భాగమే కాదు అని తేల్చేసింది. దశాబ్దాలుగా పొరుగు దేశం ప్రోద్బలంతో జరుగుతున్న ఈ మారణ హొమం స్వాతంత్ర్య ఉద్యమమే అని, ఇంతవరకూ అసువులు బాసిన జవాన్లంతా భారత దేశం కోసం అర్థం లేని పోరాటం చేసారని నిర్థారించింది. కాశ్మీర్ అక్కడ వాళ్ళ జన్మ హక్కు అని చెప్పిన జేజమ్మ, దేశాన్ని ఇంకా ఎన్ని ముక్కలు చెయ్యగలమో చెప్తే, దానికనుగుణం గా మనం ఆనందం గా వేరే వేరే దేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. స్వాతంత్ర్యం ఎవరికి మాత్రం చేదు ? అందులో మా తమిళనాడు ముందుంటుంది. రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలపై కనీసం రాళ్ళు విసురుకోలేని స్వాతంత్ర్యమూ ఓ స్వాతంత్ర్యమేనా ? ప్రత్యక్షం గానూ, పరోక్షం గానూ, దేశం లో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రు దేశం తో చేతులు కలిపే స్వేచ్చ కూడా లేకపోతే, ఇంకేం స్వేచ్చ అది. అననే అన్నారు కదా, దేశమంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుషులోయ్ అని. కాస్త మార్చి రాసుకుందాం, దేశమంటే కొందరు మనుషులేనోయ్, మిగతా దేశమంతా మట్టిగా మిగిలిపోయినా.. మిగలకపోయినా..

మానవ హక్కులకి, శాంతి భద్రతలకి వ్యత్యాసం మన జేజమ్మకి తెలియంది కాదు, కానీ ఆవిడకున్నపరిణితి మనకు లేదు మరి విషయాన్ని వేరే దృక్కోణం లో అర్థం చేసుకోడానికి. అవినీతి, అధికారం.. ఈ రెండే లక్ష్యాలుగా నడుస్తున్న మన రాజకీయాలకి ఆ మాత్రం ఆలోచన అసలే లేదు. మనుషుల్లో లానే, వ్యవస్థలోనూ లోపాలు వుంటాయి, వాటిని ఎత్తి చూపే హక్కు అందరికి వుంది. కానీ, అందులో భాగం గా, దేశ సమగ్రతకే భంగం కలిగిస్తే, మొదటికే మోసం వస్తుంది. భారత దేశం ఎన్ని ముక్కలైతే అంత ఆనందించే దేశాలు మన చుట్టూ చాలానే వున్నాయి.. మొదటి రెండు ముక్కలూ మనం చేస్తే చాలు, మిగతా పని అవే చూసుకుంటాయి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు పతనమయ్యేది ఇలానే. చరిత్ర పునరావృతం కాదని ఆశిద్దాం.


ఇంతకీ ప్రభుత్వానికి.. దేశానికి తేడా ఉందా లేదా ? మనం మన హక్కుల కోసం పోరాడాల్సింది ఎవరితో ?

1 comment:

  1. అటు కాశ్మీరూ, ఇటు తమిల్నాడూ, అటు వైపు ఈశాన్య రాష్ట్రాలూ ఎవరి జాతికి వారికిచ్చేస్తే చిన్న చిన్న దేశాలు సమర్ధవంతంగా పరిపాలించుకోవచ్చు. అలా అలా నెమ్మదిగా తెలంగాణా దేశం కూడా కోరవచ్చు. ఏం తెలంగాణా వారిది మాత్రం ప్రత్యేక జాతి కాదా? ప్రత్యేక దేశానికి అర్హులు కారా? మన దేశానికి ఒక గోర్బచెవ్ అవసరం. రష్యాని అయితే ఏ విధంగా ముక్కలు ముక్కలుగా చేసాడో అలా భారత్ నూ విడగొట్టెంత సర్ధార్ లాంటి ధీశాలి మనకిపుడు అత్యవసరం. ఆ తరువాత మిగిలిన దేశం చూడముచ్చటగా వుంటుంది కాబట్టి దానికి ఇండియా బదులు సోనియా పెట్టేస్తే ఇటలీ వారి రుణం తీర్చుకున్నట్టూ అవుతుంది కాదూ.

    ReplyDelete