Tuesday, December 28, 2010

ఉల్లిపాయలు, టమాటాలు, .. తరువాత ఏంటో చెప్పుకోండి చూద్దాం ?




గత కొన్ని రోజులుగా, ధరాఘాతం తో అల్లాడించిన ఉల్లిపాయలు.. టమాటాలు.. ఈ వరుసలో తరువాతి వంతు ఎవరిది ? నా మటుకు నాకు, నిమ్మకాయలదే అనిపిస్తోంది మరి.

ప్రతీ రోజూ, స్థానిక నాయకుడితో మొదలుకుని, అధిష్టానాల వరకూ, అందరూ ఈ నిరాహార దీక్షలు చెయ్యడాలు, గ్లాసులు గ్లాసులు నిమ్మాకాయ నీళ్ళతో విరమించేయ్యడాలు..బళ్ళ కొద్దీ నిమ్మకాయలు పాపం రసం లేని డిప్పలుగా మిగిలిపోతున్నాయి. ఇప్పుడు డిమాండ్ / సప్లై అంటూ ఓ లాజిక్ మీకు తెలిసిందే కదా, ధర మాత్రం పెరక్కేంచేస్తుంది. అందుకని, ఒకటి రెండు రోజుల్లో ఎలానో భగవద్గీత రిలీజ్ అవుతోంది కాబట్టి ఈ సారి మన నాయకులు ఈ నిరాహార దీక్షలను ప్రక్కన పెట్టి, ఏ శ్రమ దానమో, ఇంకా బాధగా ఉంటే, రక్త దానమో చేసి తమ తమ ఉద్యమాలను నడిపించుకో ప్రార్థన. పాదయాత్రలు కూడా పర్వాలేదు, మన దేశం లో తోళ్ళ పరిశ్రమకు కాస్త చేయూతని ఇచ్చినట్టు ఉంటుంది.

మరీ తప్పని పరిస్థితిలో నిరాహార దీక్షలు చేసినా, ఇంక మరి విరమించే పని పెట్టుకోవద్దు.. ఏంటంటారు ?

2 comments:

  1. బాగున్నది మీ వ్యంగ్యంతో కూడిన హాస్యం. ఎకనామిక్స్‌లో సప్లై డిమాండు సూత్రం ఉన్నది కాని. ఆ సూత్రం నిత్యవసరాలకు వర్తించదు. ఉల్లిపాయలు, టమోటల పరిస్థితి ఏమంటె, అటు పండించిన రైతుకు మంచి ధర గిట్టుబాటు కావటంలేదు, ఇటు వినియోగదారులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కొనవలిసిన పరిస్థితి. ఒకచోటినుండి మరొకచోటికి వస్తువును తీసుకు వచ్చే (ప్లేస్ వాల్యూ) మధ్య వర్తకులకు మాత్రం లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఈ మధ్య దళారుల నడ్డి విరవాలంటే, ఇలా రేట్లు పెరగంగానే మరింత ఎగబడి కొనే సామూహిక వత్తిడినుంచి అందరం బయటపడితే చాలు. టమోటాలు ఉల్లిపాయలు ఒక పది రోజులు తినకపోతే పెద్ద నష్టం లే

    ReplyDelete