Tuesday, January 11, 2011

మార్కెట్లోకి రాబోయే ఆత్మకథలు (వ్యథలు)
IPL లో గంగూలీ కష్టాలు చూస్తుంటే పగవాడికి కూడా రాకూడదు అని అనిపిస్తోంది. గంగూలీ మనసు విరిగి ఒకవేళ ఆత్మకథ రాయడం మొదలు పెడితే దానికి ఏం పేరు పెడతాడు ?, నాకైతే, "20 ఓవర్స్ టూ కిల్ రియల్ క్రికెట్" అని పెట్టి దాల్మియా కి అంకితమిస్తే బావుంటుంది అనిపించింది. ఆవిష్కరించడానికి ప్రణబ్ ముఖర్జీ ని పిలవచ్చు, కానీ అసలే పండగల సీజన్, టికెట్ దొరుకుతుందో, దొరకదో, అందుకని ఖాళీగా ఉన్న సోమనాథ్ చటర్జీ అయితే సులువు గా ఉంటుంది. ఈ రకం గా చూస్తే, ఇంకా ఎవరెవరు ఆత్మకథలు రాసే మూడ్ లో ఉన్నారా అని ఆలోచిస్తే, నాకు ఈ క్రింది పేర్లు తోచాయి.


చంద్రబాబు కరెక్ట్ గా ఆ మూడ్ లోనే ఉన్నారు, "నా రెండు కళ్ళు, నా రంగు కళ్ళ జోడు" అని పెట్టి, ఏ బిల్ గేట్స్ కో అంకితం అనచ్చు. కార్యక్రమానికి ముఖ్య అతిధి గా, జాతీయ నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా రానే వస్తాడు. ఈ మధ్యే తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసిన రోశయ్య గారైతే, "కొస (రి) మెరుపు - ఓ ఆత్మావలోకనం మరియు ఆర్త నాదం" అంటే బేషుగ్గా ఉంటుంది. సోనియా గాంధీ అక్కయ్య కూతురుకి అంకితమిచ్చుకోవచ్చు, ఇంక ప్రారంభోత్సవానికంటారా, రాబర్ట్ వధేరా గాంధీ (ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాగన్నమాట) ని పిలుద్దాం, ఇంకా , . కొంచం మసాల కథ కావాలనుకుంటే, మరి, మన మాజీ గవర్నర్ గారే కరెక్ట్. "ఏ తీగ పూవుకు.. " అని పేరు పెడితే రసవత్తరం గా ఉండనే ఉంటుంది. ఆవిష్కరణకి నిత్యానంద ని పిలిచి ABN లో లైవ్ అన్నామనుకోండి అదిరిపోతుంది. పెద్దగా కథ లేకపోయినా, DS "ఒంటరినైపోయాను.. " కూడా కోస్తాలో బానే అమ్ముడవ్వచ్చు. ఇవి కాక, మన పవన్ కళ్యాణ్ రాసే "నేను.. నా ఆత్మ.. మరియు SJ సూర్య" మీదా నాకు బాగా అంచనాలున్నాయి. కానీ ఈ ఆఖరి పుస్తకం విషయం లో మనకి పైరసీ ఒక ఛాలెంజ్ కాబోతోంది, ఫాన్స్ సహకరించాలి.


V.H గారిని కూడా అడిగి చూడచ్చు, కానీ మరీ ఆయన ఆత్మకథ కి కూడా రాజీవ్ పేరు తగిలిస్తే, జనాలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ ప్రయత్నం విరమించుకున్నాను.


ఇంతేనా అంటే,.. మీరు ఏమైనా కలపాలనుకుంటే, కామెంట్ రాయండి, నేను వొద్దనలేదు కదా.. :-)

5 comments:

 1. అయ్యయ్యో, మన టెలికాం రాజా గారిది ఎలా మరచిపోయాను... పుస్తకం పేరు - "ABCDEFGGGGG ... " :-)

  ReplyDelete
 2. సెటైర్ పేలింది. కార్టూను టూ గుడ్!

  ReplyDelete
 3. చాలా బాగుందండీ వ్యంగ్య భరిత వ్యాసం విజయ భాస్కర్ గారూ!
  అన్నట్లు మన " సంక్రాంతి పురుషుని ఆత్మ కథ "
  కూడా ఆహ్వానీయమేమో!?
  మీకు బ్లాగ్మిత్ర సంక్రాంతి శుభా కాంక్షలు.

  ReplyDelete