Sunday, February 13, 2011

అలా మొదలైంది ఇంకోలా ఉంటే ఇంకా బావుండేదేమో ?

చిన్న పని మీద, వీకెండ్ కి భాగ్యనగరానికి వచ్చా.. చెన్నై లో మళ్లీ అవుతుందో అవ్వదో అని, సతీ సమేతంగా "అలా మొదలైంది", అమీర్ పేట్ బిగ్ సినిమాస్ లో కవర్ చేసాం. ఈ మధ్య కాలం లో చూసిన మంచి తెలుగు సినిమా ఇదేనేమో. కానీ జనాలు ఇచ్చిన హైప్ వల్లనేమో, నేను కొంచం ఎక్కువ అంచనాలతో వెళ్ళడం వల్ల, ఏంటో ఇంకా ఏదో ఉంటుంది అనుకున్నా... మామోలుగానే ఉంది. ఇలాంటి సున్నితమైన కథలకి అవసరమైన ఎమోషన్స్ ఈ చిత్రం లో కొంచం తక్కువయ్యాయేమో అనిపించింది. దానికి తోడు మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ నుంచి వర్తమానంలోకి వచ్చి మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవడం, మరీ రొటీన్ గా అనిపించింది. (పాపం ఆశిష్ విద్యార్ధి ఇంకెంత ఇబ్బంది పడ్డాడో) స్క్రీన్ ప్లే ఇంటెరెస్టింగ్ గానే వుంది, కొన్ని సన్నివేశాలకి ఇంకాస్త బడ్జెట్ పెట్టి తీసుంటే, వాటి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. నువ్వే కావాలి, మనసంతా నువ్వే, జానే తూ.. వగైరా చిత్రాల్లో వచ్చే ఆ ఫీల్ ఈ సినిమా లో ఎక్కడా రాలేదు. కామెడీ మరియు నగర సంస్కృతిల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వలన, అసలు కథ కాస్త వెనుక పడిందేమో. నాకైతే, హీరో హీరోయిన్ లు కలిసినా, కలవక పోయినా, నష్టమేమీ లేదు అనిపించింది. పాత్రలు మన రోజువారీ జీవితానికి దగ్గరలోనే వున్నా, సన్నివేశాలు కాస్త ఎక్కువ నాటకీయం గా అనిపించాయి. దానికితోడు చాలా పాత్రలు మరీ సాధారణమైన నటులు చెయ్యడం వలన, ఆ పాత్రలకు పెద్దగా అర్థం లేకుండా పోయింది. (ఉదాహరణకి హీరోయిన్ తండ్రి పాత్ర)

ఇంతకంటే ఎక్కువ టైం నేను తన లాప్ టాప్ మీద కూర్చుంటే, మా అన్నయ్య ఫీల్ అవుతాడు, తరువాత నన్ను ఫీల్ అయ్యేలా చేస్తాడు. సో ఇంక ముగిస్తాను. ఇప్పుడు ఇదంతా రాసింది, మిమ్మల్ని ఈ చిత్రం చూడొద్దని చెప్పడానికి కాదు, తప్పకుండా చూడండి, కానీ నాలా మరీ ఎక్కువ అంచనాలతో వెళ్ళకపోతే మీకు సినిమా ఇంకా బాగా నచ్చుతుంది (ఇంతవరకూ చూడకపోతే లెండి). మన రెగ్యులర్ తెలుగు సినిమాలతో పోల్చుకుంటే, ఇది చాలా మెరుగైన సినిమా. సందేహమే లేదు.

చెప్పడం మరచిపోయాను, హైదరాబాద్ లో ఎండలు కుమ్మేస్తున్నాయి. (మా ఆవిడ బాషలో చెప్పాలంటే, చెన్నై చెమటే బెటర్.. :-) )

1 comment:

  1. "మన రెగ్యులర్ తెలుగు సినిమాలతో పోల్చుకుంటే, ఇది చాలా మెరుగైన సినిమా."నిజం!

    ReplyDelete