Thursday, February 17, 2011

అసెంబ్లీ వార్తలకు "A" సర్టిఫికేట్ ఇవ్వచ్చు..

అసెంబ్లీ వార్తలకు "A" సర్టిఫికేట్ ఇవ్వచ్చు..

హింస, దౌర్జన్యం, బూతులు, కోతి చేష్టలు, జుగుప్స కలిగించే ప్రవర్తన.. ఇదీ మన శాసన సభ పరిస్థితి. ఈ దరిద్రానికి సంభందించిన వార్తలు రాత్రి పదకొండు తరువాతే ప్రసారం చెయ్యాలని ఓ రూల్ పెడితే బావుణ్ణు.

ప్రజాస్వామ్యం అసలు స్వరూపమిదా ? రాజ్యాంగానికి మనం ఇచ్చే విలువ ఇంతేనా ? మనల్ని మనం పాలించుకునే అర్హత అసలు మనకు ఉందా ? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.

రాజకీయం గా JP ఎంత మార్పు తెచ్చారో.. తెస్తారో.. గానీ, వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానించే లక్షలాది మందిలో నేనూ ఒకణ్ణి. ఉద్యమం, దాని తీవ్రత, సంక్లిష్టత ఎలా ఉన్నా, భౌతికం గా JP లాంటి ఒక నాయకుని మీద దాడికి పాల్పడడం హేయమైన చర్య. ఈ రోజు జరిగిన పరిణామాల వలన JP కోల్పోయిందేమీ లేదు.. ఆయన మీద సానుభూతి, గౌరవమూ పెరిగాయే గానీ తగ్గలేదు. కానీ ఉద్యమం ముసుగులో ఎలాంటి వ్యక్తులు నాయకులు గా మారి రేపు మనల్ని ఉద్ధరించబోతున్నారో తేటతెల్లమైంది.


నిజంగానే, ఎవరైనా ప్రజలకు మంచి చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా ?
ఐదేళ్లకోసారి వచ్చే బూటకపు ఎన్నికలు - అస్థిపంజరాలకు అందాల పోటీలేనా ?

ఈ నాలుగు మాటలూ రాసి సాధించేదేమీ లేదు.. ఎందుకంటే, మన కర్మ భూమిలో అందరూ కరక్టే. కాని నా బాధని వెళ్ళగక్కకుండా ఉండలేకపోయాను. దేవుడు కూడా మనల్ని కాపాడలేడేమో..

2 comments:

  1. do not be over excited sir. you also see the comments of JP and governer as a telangana person. the way they comment about telangana is regrettable(Like not in syllabus etc).

    If an attack on them makes you to excite this much then the attack on moral of 4Cr telangana people will definetly be

    ReplyDelete
  2. మీ అభిప్రాయం తెలియ చేసినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు, ప్రభుత్వమైనా, నాయకులైనా, ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం ముమ్మాటికి తప్పే. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేవరకూ, ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ సంస్థలకు ఇవ్వాల్సిన విలువ, గౌరవం ఇచ్చి తీరాల్సిందే అని నా అభిప్రాయం.

    ReplyDelete