Tuesday, March 8, 2011

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - కరుణానిధి

ఇంటర్వల్ తరువాత కూడా మూడు, నాలుగు డ్యూయట్లు పాడుకున్న DMK, కాంగ్రెస్స్ క్లైమాక్స్ లో,ఉన్నట్టుండి U టర్న్ అన్నాయి.. ఇంతలోనే మళ్లీ కలిసిపోయాయి.

కేవలం మూడు సీట్ల కోసం ఇంత హడావిడి జరిగిందా ? ఈ మధ్యే వచ్చిన సర్వేల్లో ఎలానో DMK భవితవ్యం అంతంత మాత్రం గానే వుంది కదా, కొత్తగా మూడు సీట్లలో వచ్చేది పోయేది ఏముంది, వాటికోసం ఎవడైనా కేంద్ర మంత్రి పదవులు వదులుకుంటాడా ? నాకైతే మూడు సీట్లు కాదు, ఏవో మూడు కోర్కెల కోసం ఈ తతంగం చేసుంటారని అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో DMK కి అవసరమైనవి ఏంటి ?

నాకు అనిపించినవి..

1 2G రాజా గారి కేసు ఇంక ముందుకు వెళ్ళకూడదు, కనిమొళి పేరు పొరపాటున కూడా ఎక్కడా బయటకి రాకూడదు (ఖత్రోచి గారిలా ఎప్పుడో రాజాగారు హాయిగా బయట పడతారు)
2. వేలకోట్లు చేతులు మారిన వ్యవహారం బయటకి పొక్కకూడదు, ఆ డబ్బు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోడానికి వీలుగా కేంద్ర సహకారం
3. అదృష్టం బావుండి, హంగ్ స్థాయికి వస్తే, సోనియా అభయ హస్తం అందించాలి. (ఇంక దేనికి.. MLA లను కొనుక్కోడానికి)

(ఇంతేనా అంటే, జయలలిత మీద పాతకేసులు రెండో మూడో తిరగదోడడం, కలర్ టీవీ లు ఇవ్వద్దన్న ఎన్నికల అధికారి మార్పు, గత ఎన్నికల్లో చిదంబరం గారు వాడిన ఓటింగ్ యంత్రం లాంటివే ఈ సారి ప్రతీ చోట ఉపయోగించడం.. వగైరా.. వగైరా.. ఇలాంటి చిన్న చిన్నవి చెప్పాల్సిందేముంది.)

ఏది అయితేనేం, "అది నా తప్పే, నాదే పూర్తి బాధ్యత"- అని సిగ్గు పడకుండా ఒప్పుకునే ప్రధాని ఉన్నంతవరకూ, UPA కి ఏ డోకా లేదు. వేల కోట్లు అధినేత చేతిలోపెట్టి, ఆనందంగా జైల్లో కూర్చోగలిగే రాజాలు ఉన్నంత వరకూ, కరుణానిధి కి ఏ లోటూ రాదు..

1 comment:

 1. తమిళనాట ప్రస్తుత రాజకీయాలపై మీ విసుర్లను చూస్తున్నాను.చాలా ఆసక్తికరంగా సాగుతోంది మీ విశ్లేషణ.
  ఉచితానుచితాలు తెలియకుండా ఇష్టంవచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నారు.
  ఎవడబ్బా సొమ్మనీ కులుకుచూ తిరిగేవు..అని సామాన్యులం మనం ఎంతగా బాధపడినా ప్రయోజనం లేదు.అడగవలసిన అధికారులు స్వప్రయోజనాల కోసం అన్నీ మూసుకొని కూర్చున్నారు.
  చిదంబరంగారి ఓటింగ్ యంత్రం....అందులో లొసుగులు వివరించి,సహేతుకతను ప్రశ్నిస్తే దాన్ని సవరించుకునే ప్రయత్నం గానీ, తగిన చర్చకానీ చేసే ప్రయత్నం చెయ్యకుండా అర్థంలేని కారణాలు చూపించి ఆయనను జైల్లో పెట్టారు. ప్రశ్నించేవారికి ఏగతి పడుతుందో హెచ్చరించడమే కదా ఇది.
  ఇంకొక సంగతి.
  ప్రతిసంవత్సరం ఏప్రెల్ 14 తేదీన తమిళప్రజలు ఉగాది పండుగ చేసుకుంటారు.ఆ తేదీ ఎప్పుడూ మారదు. మొన్న కరుణానిధి సంక్రాంతి రోజునే తమిళులకి ఉగాది అని, ఆరోజే ఉగాదిగా జరుపుకోవాలని నిర్ణయించి ప్రకటించారుటగా. ఇక ఏప్రెల్ 14 తమిళులకి ఉగాది పండుగ సందర్భంగా శలవు, ఉత్సవాలు ప్రభుత్వం వైపునుంచి లేవుట కదా.
  ప్రజన నమ్మకాలు, విశ్వాసాలు, సంప్రదాయాల ను రాజకీయపరంగా దెబ్బకొట్టడం కాదూ ఇది.
  మీకు తెలిస్తే చెప్పండి.

  ReplyDelete