Friday, March 11, 2011

అన్నమయ్యది ఆంధ్రా.. రామదాసుది తెలంగాణా..

అన్నమయ్యది ఆంధ్రా.. రామదాసుది తెలంగాణా..

నిన్నటి వరకూ ఎప్పుడూ ఈ ఆలోచనకూడా రాలేదు నాకు. బహుశా, నాలాంటి చాలా మందికి కూడా.
చిలుకూరు వెంకన్నది తెలంగాణా, ఏడుకొండల వాడిది ఆంధ్రా.. అనే వాదన కూడా ఎంతో దూరం లో లేదు.

యువత ఆత్మహత్యలు చేసుకున్నారు.. తెలుగు జాతి నిజంగానే రెండు ముక్కలైంది అంటున్నారు.. (నేను ఏ ముక్కకు చెందాలో.. ?)
ఉద్యమం లోకి ఉన్మాదం చొరబడుతోంది. "మనం కాస్తా.. నువ్వూ.. నేనూ అయ్యింది.. ఇప్పుడది నువ్వో.. నేనో.. స్థాయికి దిగజారింది.. ఇంకా ముందుకెళితే. మిగిలేది మన్నే.. ఆ తరువాత, మనం గా మళ్లీ మనం ఏడవచ్చు."
ఈ విద్వేషాల మధ్య... సామాన్యుడు చస్తూ బ్రతుకుతున్నాడు. బ్రతికి చస్తున్నాడు. వాడి ఘోష ఎవడిక్కావాలి.. ?

ఇన్ని జరిగినా.. పార్టీలకు ఓట్లే కావాలి.. నాయకులకి పదవులే కావాలి..
కేంద్రానికి పక్క రాష్ట్రాల ఎన్నికలే ముఖ్యం... అదీ మన దౌర్భాగ్యం.

(మా అన్నయ్య, తెలంగాణా రాష్ట్రమే పరిష్కారం అంటున్నాడు. అమ్మ, సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అంటోంది. నాకు మాత్రం వీటిలో దేనికోసమూ చావాలని లేదు. ఎవడి విగ్రహమూ పగలగోట్టాలని లేదు.)

7 comments:

  1. @ఇన్ని జరిగినా.. పార్టీలకు ఓట్లే కావాలి.. నాయకులకి పదవులే కావాలి..

    బ్లాగర్లకి వ్యాఖ్యలు కావాలి :)

    ReplyDelete
  2. నేను ఏ ముక్కకు చెందాలో.. ?

    :)

    ReplyDelete
  3. మీరు బాగా రాశారు.. ఏం చేస్తాం సార్ ఇ దేశానికి ఒక దౌర్బగ్యపు రాజకీయపార్టీ (బిజేపి) పీడ పట్టింది... వాళ్లకు మసీదులు ద్వంసం చేయడం.. తెలుగుజాతి కీర్తికిరీటాలైన మహానీయుల విగ్రహాలు ద్వంసం చేయడమే వారి విధి , విధానాలు... భారతీయ జనతా పార్టీలో వున్న చరిత్ర హీనులే ఈ దుర్మార్గపు చర్యకు పూనుకున్నారు.. సీమాంద్రా మిత్రుల్లారా... సీమాంధ్రలో బిజేపి., సిపిఐ పార్టీలను పాతి పెట్టండి.

    ReplyDelete
  4. mari ippudu Nagarjuna emavali ???

    ReplyDelete
  5. Bammera Pothana di kuda Telangana ee :)

    Oka sari ayana gurinchi chaduvutonte telisindi appudu nenu ayyo ayana koncham itu putunte bavundede ani feel ayya kuda.........

    Safe side ga Kavitrayam matram Andhra ne.... :)

    ReplyDelete
  6. ento nenu puttindi rayalaseema,perigindi telangana, maa amma naannadi andra.mari naa paristiti ento?
    evariki varu nuvvu maaku chendav ani tharimesthara?leka nuvvu maa own ani okaru kaallu inkollu chaiyya laakku pothara?:)

    ReplyDelete
  7. nuvvu ekkada puttav em chesav annadi kadu mukhyam... nuvvu manasu lo em feel avutavu ne dream boy evaru anede mukhyam ...
    so nuvvu nisamkocham ga telangana danive....

    aina mee telangana vallaki pogaru "andhra" sariga rayadam kuda ravatle...akkada vigrahalu ikkada aksharalu roju edookati dvamsam cheste gani nidrapora???

    ReplyDelete