Sunday, March 13, 2011

తెలుగు జాతికి మరో పెను సవాల్ ? ;-)మనలో మనకి సవాలక్ష ఉండచ్చు, ఇప్పటి వరకూ, మనలో మనం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఆనందం గా వుండి ఉండవచ్చు, కానీ అవన్నీ మరచిపోయి మనం అందరం ఒక్క తాటిపై నడవాల్సిన సందర్బం ఇది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, మొత్తం తెలుగు జాతినే తుడుచుకుని పోగలిగే ఉపద్రవం..

"ఐ లవ్ యు డాడీ" దెబ్బకి ఆసుపత్రి పాలైన జనాలు ఇంకా డిశ్చార్జ్ కాకమునుపే మనం ఉహించని పెనుముప్పు మనకి మరో సవాల్ విసిరింది. పుష్పక విమానం కంటే మంచి డైలాగ్స్ తో, గగనం కంటే గొప్ప పాటలతో, అనకొండా తో పోటీ పడే కుటుంబ కథా చిత్రం "శుభం" - ప్రీమియర్ షో మన పాలిట శాపమై, మన టీవీ ల పాలిట కాల సర్పమై వస్తోంది. ఏ క్షణమైనా ఈ సునామి మన గడపల్ని చేరచ్చు, ఏ క్షణమైనా ఈ భూకంపం మన లివింగ్ రూం లో రావచ్చు. నా బాధ్యత గా నేను కొన్ని సూచనలు చేయదలిచాను. (తెలంగాణా, ఆంధ్రా భేద భావం లేకుండా, అందరూ తప్పక ఆచరించాల్సినవి)

1. కేబుల్ టీవీ సోదరులకు చెప్పి వారాంతాల్లో, పండగలలో, ఈ టీవీ ప్రసారాలు ఆపమని రిక్వెస్ట్ చేయచ్చు.
2. DTH సదుపాయం ఉన్న వారు, వాళ్ళ ఫేవరేట్ చానల్స్ లోంచి ఈ టీవీ ని తొలగించి, రిమోట్ ని పిల్లలకి అందకుండా, ఏ పుస్తకాల దగ్గరో దాచెయ్య గలరు.
3. ముఖ్యంగా, పైన చెప్పిన హై రిస్క్ టైం లో ఏ బంధువుల ఇంటికో వెళ్ళకుండా ఉంటె మంచిది. (వాళ్ళు మీ శత్రువులుగా మారే ప్రమాదముంది మరి)
4. నాగరికతకు దూరం గా, ఏ నల్లమల అడవులకో, ఆఫ్రికా అభయారణ్యాలకో వెళ్లగోరు వారికి ఇది శుభ తరుణం.
5. వృద్దులు కంటి ఆపరేషన్ కో , మానస సరోవర యాత్రకో వెళ్తే అత్యుత్తమం.
6. గర్భిణీలు, పసి పిల్లలు మరింత కేర్ ఫుల్ గా ఉండాలి, ఈ కొన్ని రోజులు టీవీ గదికి ఓ పది గజాల దూరం లో ఉంటె మరీ మంచిది.
(ఏ పాడుతా తీయగాకో కక్కుర్తి పడితే మరింక మాట/పాట మిగలదు, చూసుకోండి)

నేను చెప్పాల్సింది నేను చెప్పాను, విధి బలీయమైనది మరియు తింగరిది కనుక, ఎవరి జాగ్రత్తలు వాళ్లే తీసుకోవాలి. విధిని జయించిన వాడే మొనగాడు, మీకు తెలుసు కదా..
:-)

6 comments:

 1. Very funny. Well done. There should be strict censorship for the TV serials. Sooner the better. Lest, Psychiatrists shall have roaring practice.

  ReplyDelete
 2. బాబూ నాయందు దయవుంచి. ఆ "ఐ లవ్యూ డాడీ" DVD ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. I swear!! I'm not attempting suicide. ఆ మధ్య ఒక రివ్యూ చదివినప్పటినుండీ సుమన్‌ని మిస్సవుతున్నాను.

  ReplyDelete
 3. మీరు నాకన్నా అడ్వాన్సెడ్ గా ఉన్నారండీ.. "శుభాన్ని " అశుభం చేసేశారా? హహహ.. :) :) సుమన్ స్టోన్స్..

  Rajkumar

  ReplyDelete