Saturday, July 23, 2011

వరుణా.. సారీ.. తరుణనుకున్నా.. :-)

దొరికితేనే దొంగలు, అని అనుకునేవాణ్ణి నేను, ఎంత అమాయకుడినో చూడండి. ఇప్పుడు లేటెస్టు గా దొరికినా దొంగలు కాదు. దొరలే. మీకు అవకాశం ఉంటే, టీవీ9 స్టూడియో కి రావచ్చు, మీ నిర్ధోషిత్వాన్ని ప్రచారం చేసుకోవచ్చు, నిరూపించుకోవచ్చు కూడా. ఆరోజు 9pm యాంకర్ ఏంతేలిస్తే అదే ఫైనల్ మరి. (పోలీసులు, సాక్ష్యాలు , కోర్టులు.. అంతా దండగ)

నిజానిజాలు, వరుణ్ కీ తెలుసు.. తరుణ్ కీ తెలుసు..
ఖాన్ సారుకీ తెలుసు.. స్టీఫెన్ రవీంద్రకీ తెలుసు..

మనమే ఇక్కడ వెర్రి వెధవలం. :-) డౌటేం లేదు.

మనలో మన మాట, నిన్న రజిని కాంత్ లేడు షోలో లేకపోతే, నాటకం మరింత పండేది.

(వరుణ్ దోషికాకూడదనే నేనూ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే, డ్రగ్స్ కి బానిస అవ్వడం కంటే పెద్ద శిక్ష మరేముంది ? )

1 comment:

  1. ఇంకో మాటండోయ్, తప్పు చేసిన వాడిలో దొరికిపోతానేమో అనే భయం కనిపిస్తుంది. చెయ్యని వాడిలో, అన్యాయంగా తన పేరు ఇరికిస్తున్నారనే బాధ, ఆవేదన ఉంటాయి. వింతగా, వరుణ్ లో రెండూ కనిపించలేదు. ఎమీ అవ్వదనే ధీమా తప్ప.

    ReplyDelete