Tuesday, August 9, 2011

బందుల కేలండర్ఇందాకా మా ఆవిడ ఇచ్చిన టమటా సూప్ తాగుతుంటే నాకో అమోఘమైన ఐడియా వచ్చింది. ఈ మధ్య ఎలాగో బందులు రొటీన్ లో భాగమైపోయాయి కనుక, ప్రభుత్వం సంవత్సరం మొదల్లోనే ఒక బందుల కాలండర్ విడుదల చేస్తే ఎలా ఉంటుందని.. ముందు గానే ప్లాన్ ఉన్నవి అందులో పొందుపరచచ్చు, కొన్నేమో అధికార పార్టీకి రిసర్వ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మీకు ఫలానా తారీకునే బందు చెయ్యాలని ముచ్చటగా ఉంటే మరి ఆ విషయం ప్రభుత్వానికి తెలియ చేసి ఆ రోజుని మీకోసం అట్టేపెట్టమని అడగచ్చు. వైరి వర్గాలు ఒకే రోజుకోసం పట్టుపడితే అంటారా, అప్పుడు వేలం వేద్దాం, దానికేం భాగ్యం, ప్రభుత్వానికి ఆదాయం కూడా. పండగల మాదిరిగానే మనం అప్పుడు బందులకు కూడా సొంత ఊళ్ళకి వెళ్ళొస్తూ ఉండచ్చు. ఎప్పుడైన మన పంట పండి వరస బందులు వచ్చాయనుకోండి, దేశ పర్యటనలూ చెయ్యచ్చు. ఇదంతా బావుంది కాని, అసలు బందు అనే ఫీలింగే పోతుందే అంటారా, దానికీ ఓ మార్గముంది, బందులకి కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టుకోనిద్దాం, బహుశా స్పాన్సర్ షిప్ ని కూడా అనుమతించవచ్చేమో, మీరూ ఆలోచించండి. షాపింగ్ మాల్స్ వాళ్ళు బందు కు ముందే మంచి ఆఫర్స్ కూడా ఇచ్చుకోవచ్చు.. బందు రోజు అందరికి రెస్టు.. ఎన్నో సదుపాయాలు, ఎంతో సౌలభ్యం.. అసలు బందులు మన బంధువులైపోతాయి చూసుకోండి మరి.

పనిలో పని, టాలీవుడ్ లో మంచి సినిమాలు కూడా మనం నిర్మించుకోవచ్చు ఈ కాన్సెప్ట్ మీద.. ఉదాహరణకి "బందంటే ఇదేరా", "అందరి బందువయా", "అనుకోకుండా ఒక బందు", "బందుల్లో బందీ" (ఇది లక్ష్మి గణపతి ఫిలింస్ వారిది), "మహేష్ బాబు బందు".. వగైరా.. వగైరా..

5 comments:

 1. నాకు కూడా మొన్ననే ఇలాంటి ఆలోచనే వచ్చింది. నెలకి ఒకటి లేదా రెండు పని రోజులు బందులకు కెటాయిస్తే ఎలా వుంటుందని. ఎవరు బంద్ కావాలనుకున్నా ఎంచక్కా ఆ రోజుల్లో చేసుకోవచ్చు.

  ReplyDelete
 2. భేషో అవుడియా బాగున్నది.

  కనీసం ఇలానైనా మన ప్రభుత్వాల దూరదృష్టి మెరుగుపడుతుందేమో. మీరన్నట్లు క్యాలెండరు రిలీజ్ చేసి (అవసరైతే కింగు ఫిషరు వారి సయాయాన్నర్ధించవచ్చు ఇందుకోసం) అందులో మళ్ళీ తత్కాల్ కోటాను కూడా అనుమతించాలి. ఇందులో కొన్ని బందులకు ప్రాంతాలవారీగా అవసరమైతే కులాలవారీగా రిజర్వేషన్లు కూడా వర్తింపజేయాలి.

  అసలుకైతే అన్నిరోజుల్నీ బందుదినాలుగా ప్రకటించి (తప్పనిసరి)పనిదినాలకోసమే క్యాలెండరు విడుదలచేస్తే ప్రస్తుత పరిస్థితికి బాగా సరిపోతుందేమో.

  ReplyDelete
 3. మీ టేకు అదిరింది సార్. చప్పట్లు!
  ఈవెంట్ మేనేజిమెంటు కంపెనీల్లాగా బందు కంపెనీలు కూడా మొదలు పెట్టొచ్చు -"మీకోసం బందు చేసిపెడతాం.", "బందూ విందూ పసందూ" అంటూ.
  మన రాష్ట్రంలో ఈపాటికే మొదలైన కొన్ని కంపెనీలు ఈ రంగంలో పయొనీర్లుగా వెలుగుతూ మిగతా దేశానికి, ప్రపంచానికీ కూడా మార్గ్గదర్శకత్వం చెయ్యగలవు.

  ReplyDelete
 4. /నెలకి ఒకటి లేదా రెండు పని రోజులు బందులకు కెటాయిస్తే ఎలా వుంటుందని/

  ఇదే మీ ఆంధ్రులకు మా తెలబాన్లకు ఉన్న తేడా...నెలకు ఒకటి లేక రెండా...థూ...మా తెలంగాన మాకొచ్చినాక మేము నెలకు పది దినాలైన సమ్మెకు కేటాఇస్తం. మా KCR చెప్పిండు. ఈ ఉద్యమం లో మాకు మంచిగున్న పాఇంటు గిదే

  ReplyDelete