Friday, August 12, 2011

విదేశీ వ్యవహారాలకు ఇంకో దిక్కు లేదా ?




ఒక ప్రక్క పాక్ తన కొత్త విదేశాంగ మంత్రితో దూసుకుపోతుంటే, మనం మాత్రం ఈ S.M కృష్ణ తో నత్త నడకే నడుస్తున్నాం, ఎటువైపో కూడా తెలీదు. ఆ మధ్య ఎప్పుడో ఇక్యరాజ్య సమితిలో ఎవరో పోర్చుగీసు ప్రతినిథి చదవాల్సిన ప్రసంగ పాఠం చదవడం మొదలు పెట్టాడు ఈ మహానుభావుడు, అంతర్జాతీయ వేదికమీద అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా. మొన్నటికి మొన్న హిల్లరీ ప్రక్కనే కూర్చుని ఆఫ్ఘన్ తో మనకి ప్రత్యక్ష సరిహద్దు లేదని కుండ బద్దలుకొట్టాడు (ఆఫ్ఘన్ సరిహద్దు లో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ భాగాన్ని భారత్ ఎప్పటినుంచో మన దేశంలో ఉన్నట్టే లెక్కపెడుతోంది) ఇవి చాలక, నిన్న పార్లమెంట్ సాక్షిగా మరో కామెడీ.. భారత జైల్లో మగ్గుతున్న ఒక వైద్యుణ్ణి ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని అడిగితే, పాక్ క్షమా బిక్ష పెట్టినప్పుడు అన్నాడంట. అదీ పరిస్థితి. ప్రక్కనే కూర్చున్న సింగ్ తాతగారు లేచి ఎదో సద్దుబాటు చేసారు.

ఈ నూరుకోట్ల పైచిలుకు దేశంలో ఈ ఉత్తముడు కాక మరెవడూ దొరకలేదా మన విదేశీ వ్యవహారాలు చక్కబెట్టడానికి ? అయినా, నాకు తెలీక అడుగుతాను, బడిపంతులు ఉద్యోగానికీ, బిళ్ళ బంట్రోతు పనికీ కూడా ఉన్న వయోపరిమితి క్యాబినెట్ పదవులకి మాత్రం ఎందుకు లేదు, మన ఖర్మ కాకపోతే. కాస్తో కూస్తో కక్కుర్తి బేరమైనా ఆ శశి థరూరే నయమేమో అనిపిస్తోంది నాకు.

నా బుర్రలో మరో గొప్ప ఐడియా కూడా ఉంది, ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కనీసం విదేశాంగ మంత్రులను మార్చుకుందాం పాక్ తో ? ఏంటంటారు ? మనకి కూడా కొంచం పార్లమెంట్ సమావేశాలు చూడాలనిపిస్తుంది.. ;-)

5 comments:

  1. వార్నీ !!! బన్నీ చెప్పినట్లు కృష్ణ మీద ద్వేషం కంటే రబ్బానీ మీద ప్రేమ ఎక్కువైనట్లున్నది!!!

    ReplyDelete
  2. leaving the joke apart ,I agree with Mr.Vijayabhaskar.Mr.Krishna must be replaced immediately as foreign minister by some more competent person .

    ReplyDelete
  3. ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కనీసం విదేశాంగ మంత్రులను మార్చుకుందాం పాక్ తో ?

    GOOD IDEA .. PROPOSE THIS AT SONIA DARBAR...

    ReplyDelete
  4. ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కనీసం విదేశాంగ మంత్రులను మార్చుకుందాం పాక్ తో ?

    Super Comedy ! అమ్మా... మేడం గారి లాంటి గ్లామరస్ లేడీస్ మన నాయకుల్లో లేరని - ఎంత ఎత్తు వేసారు ?

    ReplyDelete
  5. వార్నీ !!! బన్నీ చెప్పినట్లు కృష్ణ మీద ద్వేషం కంటే రబ్బానీ మీద ప్రేమ ఎక్కువైనట్లున్నది!!!

    ...humm

    ReplyDelete