Saturday, August 20, 2011

వార్తలు కాదు.. మాకు బురదే ప్రధానం!!

నువ్వు కుక్కవి..
కాదు నువ్వు పిచ్చి కుక్కవి.
కాదు నువ్వు పిచ్చి గజ్జి కుక్కవి..
నువ్వూ.. ... **. ***. **.. ***. కుక్కవి.
(అంటే నా బ్లాగులో నేను ఇలాంటి పదాలు వాడను)

ఇదీ సాక్షి, ఈనాడు పరిస్థితి. ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడమే ప్రధానమైతే వాటికి వార్తా పత్రికలు అని పేరు ఎందుకు, మనం డబ్బులిచ్చి వాటిని కొనుక్కోవడం ఎందుకు ? ఒక ప్రక్క అవినీతిపై దేశం ఎన్నడూ లేనివిధంగా ఒక్క తాటిపై ఉద్యమిస్తోంది, తెలంగాణా సమస్యని కేంద్రం కోల్డ్ స్టోరేజీలో పెట్టి చక్కా కూర్చుంది.. అంతర్జాతీయం గా ఆర్థిక మాంద్యం పుంజుకుంటోంది.. ఈ వార్తలు, కథనాలు, విశ్లేషణలు, ఇవేవి పెద్ద ప్రధానం కాదు. రోజూ పేపర్ తెరవడం, సండూర్ పవర్, కార్నెగి, కార్మెల్ ఆసియా, డాల్ఫిన్ హోటల్, రామోజి ఫిల్మ్ సిటీ వ్యవహారాలు చదువుకోవడమే. జగన్ అంత పన్ను ఎలా కట్టాడు, రామోజీ అంత పన్ను ఎలా ఎగ్గొట్టాడు.. విష్ణు సహస్ర నామం లా. ఈనాడు "ఇదీసంగతి" కాస్తా "జగన్ సంగతి" అయిపోయింది. సాక్షిలో చెప్పే రాజశేఖరుని కొటేషన్స్ చూస్తుంటే ఒక మనిషి జీవితంలో ఇన్ని ఎలా చెప్పగలడు అనిపిస్తోంది. అదృష్ట వసాత్తూ నేను సాక్షి చదవను, ఎప్పుడో ఈ-పేపర్ తప్ప, ఈనాడు మాత్రం తప్పడం లేదు. వాళ్ళ సొంత అజెండాలు కాకుండా ఉన్న వార్తలని నిజాయితీగా చెప్పే ఒక్క తెలుగు పత్రికైనా ఉందా ?

చివరిగా ఒక మాట, మన కాలనీ బురదలో ఏ పందులో కొట్టుకుంటున్నాయనుకోండి, ఒక సారి చూస్తాం, ఛీ.. అనుకుంటాం, మహా అయితే సంబంధిత అధికారులకి మన బాధ నివేదిస్తాం, కానీ రోజూ చూసి తరించి చప్పట్లు కొట్టి ఇంకా ప్రోత్సహించలేం కదా ?

3 comments:

  1. VEELLU MARARAU ANDI..NAKU IDE BADHA...

    ReplyDelete
  2. మీకు ఒక విషయం చెప్పనా ఇలా ఒకరి మీద ఒకరు తిట్టుకోవటం వల్ల ఎవరు ఏమి ఏమి చేశారో తెలుస్తుంది, వాళ్ళు సైలెంట్ గా ఉంటె ఇవన్ని బయటకు రావు కదా, కాక పొతే మీడియా మంచి చెప్పెవాల్లని ని పట్టిచుకోవటం లేదు , రాజకీయ నాయకుడు తిడుతున్నాడు అంటే వల్ల మీద నే ఫోకస్ చేస్తుంది. ఎవరికి వారు సపోర్టింగ్ చేసుకుంటూ పక్కవారి మీద పది క్రయింగ్, ఏమైనా కానీ ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో వెయిట్ చేదాం

    ReplyDelete
  3. మీరోపని చెయ్యండి చెబుతాను అర్జంటుగా మీ కాలనీ వాళ్ళని పోగుచేసి ఆ రెండుపేపర్లనీ కొనటం మానిపించండి. కనీసం మానెయ్యండి. నేను రెండోదన్ని గత రెండేళ్ళనుంచీ ఆచరణలో పెడుతున్నాను.

    ReplyDelete