Saturday, September 24, 2011

సూపర్, ఎక్సెలెంట్, ఎక్స్ ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్..

సూపర్, ఎక్సెలెంట్, ఎక్స్ ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్..

గా ఎమీ లేదు, ఓ రెగ్యులర్ శ్రీను వైట్ల ఎంటర్ టైనర్ - దూకుడు. దుబాయ్ శీనూ ని, రెడీని కలిపి మిక్సీ లో వేసి దానికి కొంచం పొకిరీని జోడిస్తే మీకు ఇట్టే దూకుడు వచ్చేస్తుంది. తెలివైన దర్శకుడు, తెలివి అస్సలు లేని పాత్రలు, వోల్వో బస్సులో మళ్ళీ చూసాక అర్థం అయ్యే కథ, పొరపాటున రీళ్ళు అటు ఇటు అయిన అస్సలు ప్రమాదం లేని పాటలు..

కానీ పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళి, నవ్వొచ్చినప్పుడల్లా హాయిగా ఎంజాయ్ చేసి, మిగతా సమయం అస్సలు ఆలోచించకుండా కూర్చుంటే మాత్రం (అంటే నాలాగ అన్నమాట), మీకు సరదా కాలక్షేపం గ్యారంటీ.

(ఓ సాధారణ సినిమాని హిట్టుగా మార్చుకుని సంబరపడాల్సిన పరిస్థితిలో తెలుగు సినిమా ఉన్నందుకు మనసులో ఎక్కడో చివుక్కుమంటోంది)

4 comments:

  1. "...తెలుగు సినిమా ఉన్నందుకు మనసులో ఎక్కడో చివుక్కుమంటోంది) ..."

    నిజం నిజం

    ReplyDelete
  2. (కానీ పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళి, నవ్వొచ్చినప్పుడల్లా హాయిగా ఎంజాయ్ చేసి, మిగతా సమయం అస్సలు ఆలోచించకుండా కూర్చుంటే మాత్రం (అంటే నాలాగ అన్నమాట), మీకు సరదా కాలక్షేపం గ్యారంటీ.)

    మన బుర్రలు ఇంట్లో పెట్టుకుని చూడచ్చు ఇటువంటి సినిమాలు. నాకూ ఈ విషయంలో సినిమా బాగా నచ్చింది. సినిమాలో ఏముంది అంటే ఏమీ లేదు, సరదాగా సందడిగా ఉంటుంది అంతే!

    ReplyDelete
  3. cinema anta saradaga sandadiga unte maro ready dhee king anukovachu. alaa kudaa ledu kada.. average movie ne. 3 gantalu theatre lo uggabattalante kastame. as usual comedy matram adirindi. comedians pedda asset and they turned as heroes of the movie. brahmi, ms lekapote ee movie ki talk kuda ledu

    ReplyDelete
  4. meeru annattu తెలివి అస్సలు లేని (vayassu mudirina) heroes manaku boledu mandi vunnaru.

    Good Post.

    ReplyDelete