ఆనందాలు, కన్నీళ్ళు, అనుకోని మలుపులు, ఆదరించే మజిలీలు.. .... జీవితం మరీ వేగంగా వెళ్ళిపోతుంటే, నాతో నేను మాట్లాడుకోవడానికీ, నన్ను నేను గుర్తుకు తెచ్చుకోవడానికీ.. నా హరివిల్లు.
Sunday, December 25, 2011
కవరు స్టోరీ లో ఎందుకీ కల్తీ ?
ఈనాడు నిబద్దతనీ, నిజాయితీనీ ప్రక్కన పెడితే, తెలుగు దిన పత్రికగా అది అంతో ఇంతో ప్రమాణాలు పాటిస్తూనే ఉంది. ముఖ్యంగా, భాషా పరంగా, వార్తల విస్తృతి మరియు ముద్రణ విషయంలో. ఈనాడు మార్కు వార్తా విహారానికి నేను ఎప్పటినుంచో అలవాటు పడిపోయాను, అందుకే మరే పత్రిక తిరగేసిన ఏదో అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ ఈ రోజు "ఆదివారం అనుబంధం" లోని కవర్ స్టోరీ - "ఆర్థిక" ఆరోగ్యం జాగ్రత్త, చాలా నిరాశ పరచింది, చిరాకు తెప్పించింది కూడా. విషయం సముచితమైనదే, విశ్లేషణా పర్వలేదు అనిపించేలానే ఉంది, కానీ కథనంతో పాటూ ముద్రించిన ఆ చిత్రాలు అస్సలు బాగోలేవు. కొన్ని ఫొటోలు అయితే ఏదో విదేశీ మ్యాగజైన్ నుంచి కాపీ చేసారా అన్నట్టున్నాయి. ఫ్యామిలీ ఫొటో కావాలంటే, ఒక తెలుగు/భారతీయ కుటుంబపు ఫొటోయే దొరకలేదా ఈనాడు కి ? ఒక వేళ అంత సందర్భోచితమైన ఫొటో దొరక్కపోయినా, మంచి చిత్రాన్ని తామే గీయించుకోవచ్చు కదా. ఆమాత్రం అటెన్షన్, ప్రాముఖ్యత ఇవ్వలేనప్పుడు దాన్ని కవర్ స్టోరీ గా వేయనేకూడదు. ఇది ఒక రకమైన నిర్లక్ష్యాన్నే సూచిస్తోంది. భవిష్యత్ లోనైనా ఇలాంటి విషయాల్లో ఇంకాస్త శ్రధ్ధ పెడతారని ఆశిద్దాం. (పుస్తకం వెనుక మాత్రం సుమన్ బాబుతో నలుగురి ఆడవాళ్ళ ఫొటోని మాంచి నేటివిటీతో ముద్రించారు. మన ఖర్మ అలా ఉంది, ఏంచేస్తాం..)

Subscribe to:
Post Comments (Atom)
"పుస్తకం వెనుక మాత్రం సుమన్ బాబుతో నలుగురి ఆడవాళ్ళ ఫొటోని మాంచి నేటివిటీతో ముద్రించారు"
ReplyDeletenijame adiripoyindi aa photo :):)
మీరెక్కడ ఉంటారు ?
ReplyDeleteఇప్పటి కార్పోరేట్ ఉద్యోగాల వాపు సంపాదనల పుణ్యమా అని
వేష , భాషల్లో వచ్చిన మార్పుల ఫలితం ఆ కవర్ పేజి అనుకుంటా.
హైదరాబాద్, వైజాగ్ లలోనే కాప్రిలు టీ షార్ట్ వేసుకొని జుట్టుని ఎండిపోయిన గడ్డిరంగుకు మార్చిన వాళ్ళని చూస్తే
చెప్పిన నమ్మలేము "మన తెలుగువాళ్ళని"
కుటుంబాల సమావేశాల పేరుతో పిల్లలూ పెద్దలూ ఒక గదిలో మందు కొట్టే సన్నివేశం మీరు చూడలేదా?
ఆ కవర్ పేజి బొమ్మ ఇప్పటి మన నవతరం వేసుకున్నమేలి ముసుగు.
:)
ReplyDeleteyes
ఈనాడు నిబద్దతనీ, నిజాయితీనీ ప్రక్కన పెడితే, తెలుగు దిన పత్రికగా అది అంతో ఇంతో ప్రమాణాలు పాటిస్తూనే ఉంది. ముఖ్యంగా, భాషా పరంగా, వార్తల విస్తృతి మరియు ముద్రణ విషయంలో.
Its absolutely right
&
మరే పత్రిక తిరగేసిన ఏదో అసంపూర్ణంగానే ఉంటుంది.
Its one of my experience too
Nice
?!
//పుస్తకం వెనుక మాత్రం సుమన్ బాబుతో నలుగురి ఆడవాళ్ళ ఫొటోని మాంచి నేటివిటీతో ముద్రించారు. మన ఖర్మ అలా ఉంది, ఏంచేస్తాం..//
ReplyDeleteఇదెక్కడి నేటివిటీ అండీ..!
Thank god.., I'm currently away from all these "extras"..