(దీన్ని కవితగా కాక, కేవలం నా స్పందనగా చూడగలరు. అక్షరాలు ఎన్నో చెప్పాలనుకుంటాయి, కొన్నే చెప్పగల్గుతాయి..)
థానే తుఫాను
వర్షం జోరు తగ్గనే లేదు..
ఈదురుగాలి హోరు ఆగనే లేదు.
తుఫాను తాకిడికి రేయి పాపం బెదిరిపోయింది.
కానీ ఉదయభానుడు విశ్రమిస్తాడా ?
అంధకారాన్ని అలానే ఉండిపోనిస్తాడా.. ?
లేదు..
ఉధృతి మీదున్న సాగరాన్ని చీలుస్తూ..
కానరాని వినీలంపై తనదైన సంతకం చేస్తూ..
లోకాన్ని తెల్లని వెలుగుతో నింపేందుకు ఉదయిస్తాడు.
మేఘ ఘర్జనలు రవికిరణాన్ని అడ్డగించాయేమో..
కాల గమనాన్ని కాదు..
ప్రకృతి చేసిన భీభత్సానికి బ్రతుకు భయపడిందేమో..
కానీ తెలవారే సరికి గడ్డిపోచ లేచి నిటారుగా నిలబడింది..
ఆగలేని జీవన పయనానికి మార్గదర్శనం చేస్తానంది.
hmmm nice
ReplyDeleteబాగుంది...సూర్యకిరణాలనైనా ఆపగలం కానీ కాలాన్ని మాత్రం ఆపలేం... భలే చెప్పారు....
ReplyDelete