Tuesday, May 7, 2013

వీటికి ఏం పేరు పెట్టను ?


కలవడం లో ఏముంది..
కలిసి నడవడం లో ఉంది,
రైలు పట్టాలు.

---

చీకటికి ఎన్ని కిటికీలో.
తొలి కిరణాలకోసం..
ఎదురు చూపులు.

---

నువ్వు లేని వెలితిని..
నాతోనే పూరించా.
ఒంటరితనం.

---

సొంతం కానిదేదీ.
చివరకు మిగలదు.
జీవితం.

---

మౌనం సంభాషిస్తే..
మాటలకి..
మోక్షం.

---

దేవుడు పుట్టే ఉంటాడు,
మనిషిగా.
అమ్మ కోసం.

---

ఆకాశం వయసు..
లెక్క కడుతున్నాయి.
కెరటాలు.

---



రూం కి వచ్చాక ఏమీ తోచలేదు.. ఏవో ఆలోచనలు.. రాసుకున్నాను.
వీటికి ఏం పేరు పెట్టను ?

6 comments:

  1. వీటికి ఏం పేరు పెట్టను ?

    మూడు ముక్కల mood అని పేరు పెట్టండి !


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. wonderful... జిలేబీ గారి title. చీకటికి ఎన్ని కిటికీలో...కిటికీలో అని చదవగానే చెబుతున్నాను...honestly... ఎందుకో నవ్వు వచ్చింది. దాని బదులు కన్నులు అని వాడవచ్చేమో. I am very poor in poetic lang. All r nice to read.

    ReplyDelete
  3. vijay musings - idi baguntundemo

    ReplyDelete

  4. పేరు ఏదైనా గానీ నాకు మాత్రం మొదటిది చాలా చాలా నచ్చేసిందండీ.. :)

    ReplyDelete
  5. బ్లాగుందన్నా.. బ్లాగోలేదన్నా.
    నడిపించే సరదా మెట్లు..
    కామెంట్లు. :-)

    ReplyDelete
  6. కలవడం లో ఏముంది..
    కలిసి నడవడం లో ఉంది,
    రైలు పట్టాలు.


    నువ్వు లేని వెలితిని..
    నాతోనే పూరించా.
    ఒంటరితనం.


    ఇవి చాలా నచ్చాయి.

    ReplyDelete