Friday, May 24, 2013

R.I.P మొగలి రేకులు


భూమితో పాటే పుట్టి ఉంటావు,
డిష్షులతో, కేబుళ్ళతో ఇరగ పెరిగి,
మా ఆడుగులో అడుగు కలిపావ్.
నీకు కష్టమైతే మాతో కన్నీరు పెట్టించావ్.
సంతోషాల్ని కమెర్షియల్ బ్రేకుల్లో ఇచ్చావ్.
మా నేలబారు బ్రతుక్కి,
పగలు, ప్రతీకారాలు పరిచయం చేసావ్.
తరాలు మార్చావ్, తలలు మార్చావ్..
అయినా కోత మారలేదు, మా రాత మారలేదు.

ఆగిపోతావేమో అని ఆశ పడినప్పుడల్లా,
"నాన్నా పులి" కథే గుర్తు చేసావ్.
మా సహనానికీ, నీ సాగదీతకీ,
జరిగిన ఈ పోరాటంలో..
నువ్వు ఓడి మమ్మల్ని గెలిపించావ్.
అంతేనా ? ఏమో..
మేము పోగొట్టుకున్న అరగంటల్ని,
మరి వడ్డీతో అందిస్తావా ?
టీవీలో లో దూరం అయ్యావు కానీ..
మా బుర్రల్లో ఉండక చస్తావా.
నువ్వు ఎక్కడున్నా, నువ్వు చేసిన ఈ మేలు..
మా రూముల్లో టీవీలు ఉన్నంతకాలం..
మా చేతుల్లో రిమోట్లు ఉన్నంతకాలం..
గుర్తు చేసుకుంటూనే ఉంటాం..
నువ్వు చేసిన గాయాలు తడుముకుంటూనే ఉంటాం.

నీ ఆత్మ శాంతికై,
టీవీ ని రెండు నిమషాలు,
మ్యూట్ లో పెడుతూ..
నీ అభిమాన బాధితులు.

11 comments:

  1. naku doubt e. idi mugimpu kademo Nandi. appudosari alaane annaaaru.

    ReplyDelete
  2. "నీ ఆత్మ శాంతికై,
    టీవీ ని రెండు నిమషాలు,
    మ్యూట్ లో పెడుతూ..
    నీ అభిమాన బాధితులు."--- Great !!!!

    ReplyDelete
  3. @Sujata garu, ప్రతి ప్రారంభానికి ఓ ముగింపు ఉంటుందని నమ్మండి..మరీ అంత నిరాశ పడితే ఎట్టా?

    సంతోషాన్ని కమర్షియల్ బ్రేకుల్లో ఇచ్చావ్......తరాలు మార్చావ్....తలలు మార్చావ్...వాటెనబ్జర్వేషన్ సర్జీ!!

    ReplyDelete
  4. nice ani kavitaki maarkulu vEsi paarEsaa kaanee, naaku yee rEkulu eppuDuu guchchukOlE, kaneesam smell kooDaa raalE..some how I missed a fantastic thing anipistOndi..

    ReplyDelete
  5. avataram chalinchi .. "Sravana Sameeralu " ane kotha avataram dalchanu anthe - Mogali Rekulu :-)

    ReplyDelete
  6. బావుంది అండి మీ కవిత , చివరి నాలుగు lines చాలా బావున్నాయి.

    ReplyDelete