Saturday, June 22, 2013

నాన్ననయ్యానోచ్!!



నిన్న శుక్రవారం, 4:04PM కి, మాకు అబ్బాయి పుట్టాడు. జీవితం మరో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఎన్ని రంగులో.. అపురూపమైన క్షణాలు, కలకాలం దాచుకోవాల్సిన జ్ఞాపకాలు. మీ అందరి ఆశీస్సులు వాడికి ఉండాలని కోరుకుంటూ.. (మా ఫ్రెంచ్ బాసుల పుణ్యమా అని, నేనూ ప్యారిస్ నుంచి మొన్న ఆదివారమే చెన్నై చేరుకున్నాను లెండి సకాలంలో. )  లేలేత పూబాలలా ఉన్న వాడిని, ఫొటోల్లో బంధించేందుకు ఇంకా ధైర్యం చాల్లేదు. మరికొన్ని రోజుల్లో, ఫొటో తీసి, మీతో పంచుకుంటాను.


8 comments:

  1. జీవితంలో నాన్న కావడం ఒక అందమయిన అనుభవం!అది అనిర్వచనీయం!అందుకే అందుకోండి మా అభినందనం!మంచిబడిలో సీట్ కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించండి మరి!

    ReplyDelete
  2. మీ వంశోధ్ధారకుడికి ఆశీర్వచనాలు....

    ReplyDelete
  3. జన్మతీసుకొని ఎంతమందినో సంతోషపెట్టడం ఒక్క ఆ పసివారికే తెలుసునండి . మీ దంపతులకు , మీ చిన్నారికి నా శుభాభినందనలు .

    ReplyDelete
  4. అభినందనలండీ.

    ReplyDelete
  5. మీ దంపతులకు శుభాకాంక్షలు . బుజ్జిభాస్కర్ కు ముద్దులు .

    ReplyDelete
  6. wow!congrats n my heartful blessings to ur baby.

    ReplyDelete