Friday, November 1, 2013

మోడీ ప్రధాని పదవికి ముఖ్య సోపానం ?

ఏముంది, ప్రత్యర్థి రాహుల్ గాంధీ అవ్వడమే.

ఇన్ని స్కాములు తరువాత కూడా ఎవరైనా కాంగ్రెస్ కి వోటేస్తారా ? ప్రస్తుతానికి ఒపీనియన్ పోల్స్ అయితే మోడీ వైపే మొగ్గు చూపుతున్నాయి. నిజానికి, దేశం లో ఎన్నో వర్గాలకు, ఇంకా మోడీ మీద నమ్మకం లేదు, కానీ రాహుల్ తో పోల్చుకుని చూస్తే, మరి మోడీ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాలను BJP స్వీప్ చేసేలానే ఉంది. దక్షిణాది లో కమలానికి పెద్ద వోట్ బ్యాంకు లేకపోయినా, జయలలిత మోడీ వెంటే నడుస్తుంది. ఎన్ని సీట్లు మిగుల్తాయో కాని, బాబు కూడా BJP నే బలపరుస్తాడు అనిపిస్తోంది, మరి లౌకికవాదమో, అంటే, ఏముంది, దగాకోరు కాంగ్రెస్స్ ని గద్దె దించడానికి, తెలుగు వాడి ఆత్మగౌరవం, ఆవకాయ పచ్చడి కోసం తప్పలేదు అనొచ్చు.

ఆటా ఇటా లా ఉన్న వోటర్లు, పార్టీలు కూడా, మోడీ గెలుపు ఖాయమనిపిస్తే, ఆయన వైపే జట్టు కడతారు. మెల్లగా కాంగ్రెస్స్ మన్మోహన్ నే బలిపశువును చేస్తోంది, మంచి సోనియాది, మిగిలిన చెత్త అంత సింగు గారి ఎకౌంటు. కానీ, ఏంచేసినా రాహుల్ ని నాయకుడి గా నిలబెట్టడంలో మాత్రం సఫలం కాలేక పోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో రాహుల్ మోడిని గట్టిగా విమర్శించే ధైర్యం కూడా చెయ్యలేడు.

డిల్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవబోతోంది, వచ్చే పార్లమెంటు లో ఒకరిద్దరు సభ్యులైనా సామాన్యుల గొంతు వినిపిస్తే సంతోషమే.                                (కార్టూన్ ఇండియాటుడే వెబ్సైటు లోనిది)

4 comments:

 1. "మోడీ ప్రధాని పదవికి ముఖ్య సోపానం"

  మీడియాలో ఒక వర్గం ఆయన మీద చేస్తున్న విషపూర్తమైన దుష్ప్రచారం

  ReplyDelete
 2. In the recent past, who is the leader inspired the masses of India with his pragmatic analysis? Can you think of one. Instead of Rahul, even if you put chidambaram or any other person for that matter Modi will come winning with flying colors.

  ReplyDelete
 3. ఎప్పుడూ ఒకే పార్టీని పట్టుకొని వేళ్ళాడ్డం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం!

  ReplyDelete
 4. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి.. అల్లోపతి మందుకు కి సైడ్ ఎఫెక్ట్స్ లా, మోడీ తో కొన్ని చిక్కులున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో రోగి బ్రతకాలంటే మోడీ మందు పడక తప్పదు. కూటమి గొడవులు లేకుండా కాస్త మంచి మెజారిటి వస్తే మెరుగైన పాలన కి అవకాశం ఉంటుంది.

  ReplyDelete