Monday, March 30, 2015

మా బుడ్డోడు నేర్పినవి..

మా బుడ్డోడు నేర్పినవి..

పడిపోయినా అడుగు ఆపక్కర్లేదని..
ఎగిరే పక్షికే కాదు.. అస్తమించే సుర్యుడికీ టాటా చెప్పాలని..
పాట ఏదైనా మనకొచ్చిన నాట్యం చెయ్యొచ్చని..
అప్పుడప్పుడు సరదాగా నాలుగడుగులు వెనక్కి వెయ్యచ్చని..
చిరునవ్వులు పంచడానికి పరిచయం అక్కర్లేదని..
గాయాలని తడుముకుని ఏడవద్దని..
చందమామని క్రిందకి రమ్మని రోజూ పిలవచ్చని..

చెప్పడానికి మాటలెందుకని..

1 comment:

  1. కొందరు బోధ గురువులు,
    కొందరు బాధ గురువులు -
    పిల్లలు సహజ గురువులు!

    ReplyDelete